Thursday, October 18, 2012

పవర్ కోసం వీధిన పడ్డ వై.ఎస్. ఇంటి పడుచులు !

కడప,అక్టోబర్ 18:  వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల గురువారం మధ్యాహ్నం తన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రను ప్రారంభించారు.  వైయస్సార్ ఘాట్ నుండి ప్రారంభమైన షర్మిల యాత్రలో తొలి రోజున జగన్ సతీమణి భారతి రెడ్డి, తల్లి విజయమ్మ పాల్గొన్నారు. షర్మిల సాయంత్రం ఐదు గంటల వరకు ఆరు కిలోమీటర్లు నడిచారు. ట్రిపుల్ ఐటి, వీరగట్టుపల్లె, కుమ్మరాంపల్లె మీదుగా ఆమె యాత్ర కొనసాగింది.  పార్టీ నేతలు శోభా నాగి రెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి, వాసిరెడ్డి పద్మ, రోజా తదితరులు కూడా షర్మిల వెంటఉన్నారు. నల్లబ్యాడ్జీలు ధరించి వారు పాదయాత్ర చేపట్టారు.  పాదయాత్ర ప్రారంభానికి ముందు ఇడుపులపాయలో విజయమ్మ, షర్మిల భారీ బహిరంగ సభలో మాట్లాడారు. టిడిపి, కాంగ్రెసు కుమ్మక్కై జగన్‌ను జైలుకు పంపించారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు తమ వెంటే ఉన్నారన్నారు. షర్మిల తనను  దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి కూతురుగా, జగన్ సోదరిగా పరిచయం చేసుకున్నారు. తన అన్న తరఫున తాను పాదయత్ర చేస్తున్నట్లు షర్మిల చెప్పారు. రాజన్న కూతురిగా..... జగనన్న చెల్లెలిగా... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వస్తున్నానని,  తాను జగనన్న వదిలిన బాణాన్ని అని.... అందరూ కలిసి రావాలని షర్మిల పిలుపునిచ్చారు. జగనన్న నాయకత్వంతోనే రాజన్న రాజ్యం సాధ్యమవుతుందని ఆమె అన్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...