Friday, October 26, 2012

ఎస్.ఎం.కృష్ణ ...బ్యాక్ టు హోం...!

న్యూఢిల్లీ, అక్టోబర్ 26:  కేంద్ర మత్రివర్గ విస్తరణ ఊహాగానాల నేపథ్యంలో విదేశాంగ మంత్రి ఎస్.ఎం.కృష్ణ  తన పదవికి రాజినామా చేసినట్టు తెలిసింది. కర్ణాటకకు చేందిన  80 ఏళ్ళ కృష్ణ ప్రధానికి తన రాజినామా లేఖను పంపినట్టు  సమాచారం. వచ్చే ఏడాది మే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున ఆయనకు ఆ రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగిస్తారని తెలుస్తోంది. లోగడ ఆయన కర్ణాటక సి.ఎం. గా పనిచేశారు. 2009 లో యు.పి.ఎ. ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్.ఎం.కృష్ణ  కు విదేశాంగ శాఖ  అప్పగించారు. 
 కొత్త  విదేశాంగ  మంత్రి ఆనంద శర్మ ?
 విదేశాంగ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన ఎస్.ఎం. కృష్ణ స్థానంలో ప్రస్తుతం వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న ఆనంద శర్మ నియమితులు కావచ్చని సంచారం. హిమాచల్ ప్రదేశ్ కు చెందిన ఆనంద శర్మ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.
 
  

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...