Saturday, October 13, 2012

2011 నంది అవార్డులు : ఉత్తమ నటుడు మహేష్ బాబు...ఉత్తమ నటి నయనతార

హైదరాబాద్, అక్టోబర్ 13:  రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా అందించే నంది అవార్డులను శనివారం ప్రకటించారు. 2011 సంవత్సరానికి గాను ఉత్తమ నటుడిగా మహేష్ బాబు(దూకుడు) ఎంపిక కాగా, ఉత్తమ నటిగా నయనతార (శ్రీరామ రాజ్యం), ఉత్తమ చిత్రంగా శ్రీరామ రాజ్యం ఎంపికయింది. ఉత్తమ దర్శకుడిగా ఎన్ శంకర్ (జైబోలో తెలంగాణ) ఎంపికయ్యారు. ఇతర అవార్డుల వివరాలు:  ఉత్తమ విలన్ : మంచు లక్ష్మి (అనగనగా ఒక ధీరుడు), ఉత్తమ ద్వితీయ చిత్రం : రాజన్న, ఉత్తమ తృతీయ చిత్రం : విరోధి, ఉత్తమ గాయకుడు : గద్దర్ (జై బోలో తెలగాణ చిత్రంలోని పొడుస్తున్న పొద్దుమీద ), ఉత్తమ గాయని: మాళవిక (రాజన్న), ఉత్తమ సంగీత దర్శకుడు : ఇళయరాజా (శ్రీరామ రాజ్యం),   ఉత్తమ కుటుంబ కథాచిత్రం : 100% లవ్, ఉత్తమ హాస్య నటుడు : ఎంఎస్ నారాయణ(దూకుడు), ఉత్తమ సహాయ నటుడు : ప్రకాష్ రాజ్ (దూకుడు), ఉత్తమ పిల్లల చిత్రం : శిఖరం, ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం : అవయవదానం, ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ : సమ్మెట గాంధీ(రాజన్న), ఉత్తమ సహాయనటి : రత్నసాగరి(కారాలు మిర్యాలు), ఉత్తమ బాల నటుడు : నికిల్ (100% లవ్), ఉత్తమ బాల నటి : బేబి ఆని(రాజన్న), ఉత్తమ మాటల రచయిత : నీలకంఠ (విరోధి), స్పెషల్ జ్యూరీ అవార్డ్ (మేల్): అక్కినేని నాగార్జున (రాజన్న), స్పెషల్ జ్యూరీ అవార్డ్ (ఫిమేల్ ) : చార్మి (మంగళ), ఉత్తమ గేయ రచిత : సురేందర్ (పోరు తెలంగాణ),  ఉత్తమ స్క్రీన్ ప్లే : శ్రీను వైట్ల(దూకుడు). 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...