Thursday, October 11, 2012

వై.ఎస్. ఫ్యామిలీ మరో ప్రజా ప్రస్థానం...18 నుంచి షర్మిల పాదయాత్ర...

హైదరాబాద్, అక్టోబర్ 11: : రాష్ట్రంలో ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు తన కూతురు  షర్మిల పాదయాత్ర చేస్తుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ తెలిపారు. షర్మిల పాదయాత్రను ప్రారంభిస్తుందని, తరువాత జగన్ బెయల్ పై విడుదలయి వస్తే ఆయన పాదయాత్రను కొనసాగిస్తారని  విజయమ్మ చెప్పారు. ఈ పాదయాత్రను జగన్ చేపట్టాలనుకున్నారని కానీ, ఆయన జైలుకు వెళ్లడంతో షర్మిల చేపట్టేందుకు సిద్ధపడిందని చెప్పారు. తన ఆరోగ్యం దృష్ట్యా తనను వద్దని పార్టీలోని పెద్దలు సూచించారన్నారు. జగన్ స్థానంలో ఎవరో ఒకరు పాదయాత్ర చేయాలని చర్చించుకుంటున్న సమయంలో షర్మిల అందుకు సిద్ధపడ్డారన్నారు. పాదయాత్ర మధ్యలో తాను, జగన్ సతీమణి భారతి రెడ్డి అప్పుడప్పుడు పాలు పంచుకుంటామన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తితో ప్రజల్లోకి వెళుతున్నామని చెప్పారు. అందుకే ఆయన ప్రజా ప్రస్థానం పేరుతో యాత్ర చేస్తే షర్మిల మరో ప్రజా ప్రస్థానం పేరుతో యాత్ర చేస్తారన్నారు.  తెలంగాణ జిల్లాల్లో కూడా యాత్ర ఉంటుందని చెప్పారు. చంద్రబాబు యాత్రకు తమ యాత్రకు తేడా ఉంటుందన్నారు. ఆయనపై ప్రజలకు విశ్వాసం లేదని, కానీ తమ పార్టీపై ప్రజలకు నమ్మకం ఉందన్నారు. ఈ నెల 18న ఇడుపులపాయ నుండి ప్రారంభమయ్యే షర్మిల పాదయాత్ర  కడప, అనంతపురం, కర్నూలు, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ, గుంటూరు, కృష్ణా, ఖమ్మం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా వరకు సాగుతుంది.ఇచ్చాపురంలో ముగుస్తుంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...