'తెహల్కా' బంగారు కు బెయిల్...
న్యూఢిల్లీ, అక్టోబర్ 11: తెహల్కా కేసులో నిందితుడైన భారతీయ జనతా పార్టీ జాతీయ మాజీ అధ్యక్షుడు, దళిత నేత బంగారు లక్ష్మణ్ కు ఢిల్లీ హైకోర్టు ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేసింది. ఆయనకు రూ.50వేల పూచికత్తుతో న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. ఆయుధ డీలర్ల నుంచి లక్ష రూపాయిలు లంచం తీసుకుంటూ తెహల్కా డాట్ కామ్ చేసిన స్టింగ్ ఆపరేషన్ లో బంగారు లక్ష్మణ్ పట్టుబడిన సంగతి తెలిసిందే. గత ఏప్రిల్ నుంచి బంగారు లక్ష్మణ్ జైలులో ఉన్నారు.
Comments