Wednesday, October 10, 2012

తెలంగాణ పరిష్కారం ఎప్పుడో చెప్పలేం : షిండే

న్యూఢిల్లీ, అక్టోబర్ 10: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో తాము తెలంగాణ అంశంపై చర్చించ లేదని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే  స్పష్టం చేశారు.  తెలంగాణపై ఇప్పట్లో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయబోమని షిండే స్పష్టం చేశారు. కెసిఆర్‌తో తెలంగాణ అంశంపై  తాను ఎలాంటి చర్చలు జరపలేదన్నారు. తెలంగాణపై అభిప్రాయ సేకరణ కొనసాగుతోందని చెప్పారు. కేంద్రం ప్రక్రియను కొనసాగిస్తోందని,  అయితే ఈ సమస్యపై పరిష్కారం ఎప్పుడు వస్తుందో ఇప్పుడే చెప్పడం కష్టమన్నారు.
 తెలంగాణ రాదని తేలిపోయింది:  లగడపాటి
కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటనతో తెలంగాణ రాదని తేలిపోయిందని ఎంపి లగడపాటి రాజగోపాల్ అన్నారు. టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు చెప్పేవన్నీ అబద్ధాలేనన్నారు. రాష్ట్రంలో 80 శాతం మంది సమైక్యాంధ్రను కోరుకుంటున్నారని తెలిపారు. ఏకాభిప్రాయం లేకుండా తెలంగాణ రాష్ట్రం సాధ్యం కాదని అన్నారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...