Wednesday, March 7, 2012

ఇక అడిలైడ్ లో ఆఖరి పోరాటం

అడిలైడ్ ,మార్చి 6:   ముక్కోణపు వండే సిరీస్ లో శ్రీలంక-ఆస్ట్రేలియా మధ్య నిర్ణయాత్మక మూడో ఫైనల్ గురువారం  అడిలైడ్ లోజరుగుతుంది. ఓవల్‌లో మంగళవారం జరిగిన రెండో ఫైనల్లో శ్రీలంక 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై గెలిచి బెస్టాఫ్ త్రీ ఫైనల్స్ సిర్రీస్ ను 1-1 తో సమం చేసింది.  272 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన లంక... 44.2 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 274 పరుగులు చేసి అలవోకగా నెగ్గింది. ఓపెనర్ దిల్షాన్ (119 బంతుల్లో 106; 10 ఫోర్లు) అద్భుతంగా ఆడి సెంచరీ సాధించాడు. మరో ఓపెనర్, కెప్టెన్ జయవర్దనే (76 బంతుల్లో 80; 8 ఫోర్లు, 1 సిక్సర్) మెరుపు ఇన్నింగ్స్ తో అర్ధసెంచరీ చేశాడు. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు ఏకంగా 27.1 ఓవర్లలో 179 పరుగులు జోడించి విజయానికి పునాది వేశారు. సంగక్కర (57 బంతుల్లో 51 నాటౌట్; 5 ఫోర్లు) సమయోచితంగా ఆడి చివరి వరకూ క్రీజులో ఉండి విజయానికి కావలసిన పరుగులు చేశాడు.  నిలకడగా ఆడిన  చండిమల్ (17 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు) సంగక్కరకు అండగా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో బ్రెట్‌లీ, ప్యాటిన్సన్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (140 బంతుల్లో 100; 4 ఫోర్లు, 1 సిక్సర్) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సెంచరీ చేశాడు. కెప్టెన్ మైకేల్ క్లార్క్ (91 బంతుల్లో 117; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) వేగంగా ఆడి శతకం చేశాడు. వార్నర్, క్లార్క్ మూడో వికెట్‌కు 184 పరుగులు జోడించడం విశేషం. లంక బౌలర్లలో మలింగ మూడు వికెట్లు తీసుకోగా... దిల్షాన్ ఒక్క వికెట్ పడగొట్టాడు.ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన దిల్షాన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...