Wednesday, March 7, 2012

ఉత్తరప్రదేశ్ ప్రజలు తప్పు తెలుసుకుంటారు-మాయావతి

గవర్నర్  కు రాజీనామా సమర్పిస్తున్న మాయావతి
లక్నో,మార్చి 7:   ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో బి.ఎస్.పి. ఘోర పరాజయంతో   ముఖ్యమంత్రి మాయావతి గవర్నర్ కు తన రాజీనామాను సమర్పించారు. అనంతరం  విలేకరులతో మాట్లాడుతూ సమాజ్ వాదీ పార్టీ బూటకపు వాగ్దానాలతో  ప్రజలను మోసం చేసిందన్నారు.  దళితులు ఇప్పటికీ తనవైపే ఉన్నారని చెప్పారు. యుపికి కేంద్రం చేసింది ఏమీలేదన్నారు.    కేంద్రం సహకరించకపోయినా యూపీ అభివృద్ధికి కృషి చేసానని మాయావతి పేర్కొన్నారు. తాను సీఎంగా అధికారం చేపట్టే సమయంలో యూపీ గందరగోళంగా ఉందని, ఐదేళ్లలో మంచి పాలన అందించామని మాయవతి తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ తప్పుడు విధానాలవల్లే బీఎస్పీకి ఓట్లు చీలాయని మాయావతి ఆరోపించారు. రిజర్వేషన్ల అంశాన్ని బీజేపీ,కాంగ్రెస్‌లు స్వార్ధం కోసం వాడుకున్నాయని, ఓబీసీలను బీఎస్పీ నుంచి దూరం దూరం చేశాయని అన్నారు. బీఎస్పీ ప్రవేశపెట్టిన పథకాలను సమాజ్‌వాది పార్టీ కొనసాగిస్తుందన్న నమ్మకం తమకు లేదని మాయావతి పేర్కొన్నారు. అన్ని వర్గాల అభివృద్ధికి బీఎస్పీ కృషి చేసిందని ఆమె తెలిపారు. ఉత్తరప్రదేశ్ ప్రజలు చేసిన తప్పేమిటో త్వరలోనే తెలుసుకుంటారని మాయావతి అన్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...