Saturday, March 31, 2012

జగన్ ఆస్తుల కేసులో సిబిఐ చార్జిషీట్

మొదటి నిందితుడిగా జగన్
హైదరాబాద్,మార్చి 31:  కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ శనివారం సాయంత్రం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని మొదటి నిందితుడిగా చేర్చారు. రెండో నిందితుడిగా జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయిరెడ్డిని చేర్చింది. సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్‌లో  మొత్తం 13 మంది పేర్లను నిందితులుగా చేర్చింది. ఎమ్మార్ కుంభకోణం కేసులో నిందితుడు బిపి ఆచార్య ను కూడా నిందితుడు గా చేర్చారు. అరవిందో ఫార్మాను 3వ ముద్దాయిగా, నాలుగో ముద్దాయిగా హెటిరో డ్రగ్స్‌ను సిబిఐ చేర్చింది. ఐదో ముద్దాయిగా ట్రిడెంట్‌ను చేర్చింది. ఆరో నిందితుడిగా శ్రీనివాస రెడ్డిని, ఏడో నిందితుడిగా నిత్యానంద రెడ్డిని చేర్చింది. ఎనిమిదో నిందితుడిగా శరత్ చంద్రా రెడ్డి, తొమ్మిది నిందితుడిగా బిపి ఆచార్యను, పదో నిందితురాలిగా ఇద్దనపూడి విజయలక్ష్మిని, 11వ నిందితుడిగా చంద్రమౌళి, 12వ ముద్దాయిగా జగతి పబ్లికేషన్స్, 13వ ముద్దాయిగా జననీ ఇన్‌ఫ్రాలను సిబిఐ చేర్చింది.వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జారీ అయిన 26 వివాదాస్పదమైన జీవోలను సిబిఐ పరిశీలించింది. వైయస్ జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన పలువురు వ్యాపారవేత్త వాంగ్మూలాలను నమోదు చేసింది. వైయస్ హయాంలో కీలక బాధ్యతలు నిర్వహించిన పలువురు ఐఎఎస్ అధికారులను విచారించింది. సండూర్ పవర్ నుంచి జగన్ సంస్థల్లోకి నిధులు మళ్లిన వైనాన్ని పరిశీలించింది. 263 డాక్యుమెంట్లతో 68 పేజీల చార్జిషీట్‌ను సిబిఐ ప్రత్యేక కోర్టులో సమర్పించింది. కాగా, ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన విజయసాయి రెడ్డి జ్యుడిషియల్ రిమాండ్‌ను ఏప్రిల్ 13వ తేదీ వరకు కోర్టు పొడగించింది. 
అరెస్టు పై పుకార్లు
ప్రత్యేక కోర్టులో సిబిఐ చార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో  వైయస్ జగన్ ఏ క్షణంలోనైనా అరెస్టు కావచ్చుననే పుకార్లు ఊపందుకున్నాయి. దీంతో పార్టీ కార్యకర్తలు పెద్ద యెత్తున హైదరాబాదు చేరుకుంటున్నారు. ప్రస్తుతం వైయస్ జగన్ గుంటూరు జిల్లాలో ఉన్నారు. గుంటూరు జిల్లాలో పోలీసు బందోబస్తును పెంచారు. పెద్ద యెత్తున పోలీసులను మోహరించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు పలువురు కూడా హైదరాబాదుకు చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...