Saturday, March 31, 2012

తెలంగాణాపై నాలుగు పార్టీల అభిప్రాయం కోరాం; చిదంబరం

న్యూఢిల్లీ,మార్చి 31: తెలంగాణపై ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాలుగు పార్టీల అభిప్రాయం కోరినట్లు కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం చెప్పారు. కాంగ్రెసు, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు, మజ్లీస్ పార్టీలు తెలంగాణపై అబిప్రాయం చెప్పలేదని ఆయన చెబుతూ వస్తున్నారు. తెలంగాణపై నిర్ణయం తీసుకుని వైఖరి చెప్పాలని కోరినట్లు ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. తెలంగాణపై రాష్ట్రానికి చెందిన 8 పార్టీలతో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉందని,  నాలుగు ప్రధాన రాజకీయ పార్టీలు నిర్ణయానికి వచ్చి అభిప్రాయం చెప్పిన వెంటనే అఖిల పక్ష సమావేశం జరుగుతుందని ఆయన వివరించారు. తెలంగాణలో ఆత్మహత్యలు జరుగుతున్న విషయం తనకు తెలుసునని, ప్రతి సంఘటనా తన దృష్టికి వస్తోందని ఆయన అన్నారు. తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకోవడం సరి కాదని ఆయన అన్నారు. ఆత్మహత్యల వల్ల ఒరిగేదేమీ లేదని, బతికి సాధించాలని, జీవించి పోరాటం చేయాలని ఆయన అన్నారు. రాష్ట్రానికి చెందిన రాజకీయ పార్టీలతో తాను టచ్‌లో ఉన్నానని ఆయన చెప్పారు. నాలుగు ప్రధాన పార్టీలు ఓ నిర్ణయానికి వచ్చి తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తాయని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...