Monday, March 19, 2012

బడ్జెట్ కు త్రివేది బలి...

పదవికి రాజీనామా _ కొత్త రైల్వేమంత్రిగా ముకుల్ రాయ్     
న్యూఢిల్లీ,మార్చి 18: తృణమూల్ కాంగ్రెసులో వివాదం ముగిసింది. రైల్వే మంత్రి దినేష్ త్రివేది ఎట్టకేలకు రాజీనామా చేశారు. రైల్వే చార్జీలను పెంచుతూ ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్, ఆయన పదవికే ఎసరు తెచ్చింది. ఒకవైపు పార్టీ అధ్యక్షురాలు రాసిస్తే తప్ప రాజీనామా చేయబోనని మొండికేస్తూనే, ఆమెపై తనకు గౌరవం ఉందని చెబుతూ వచ్చిన త్రివేదీ... పార్టీ ఒత్తిడితో తన పదవిని వదులుకోవడం విశేషం. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన త్రివేదీ, ఆదివారం సాయంత్రం పార్టీ అధినాయకురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత రాజీనామా సమర్పించారు. ఆయన తన రాజీనామా లేఖను ప్రధాని మన్మోహన్ సింగ్‌కు పంపించారు. ఆయన స్థానంలో ముకుల్ రాయ్ రైల్వే మంత్రిగా పదవీ బాధ్యతలు చేపడతారు.
 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...