Monday, March 19, 2012

చిరుకు చివరకు రాజ్యసభ ...

హైదరాబాద్,మార్చి 18:  రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ అధిష్టానం సంచలన  నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం ఎంపీలుగా కొనసాగుతున్న నలుగురు సిట్టింగులకు  షాకిచ్చింది. వారి స్థానంలో నాలుగు కొత్త ముఖాలకు చోటు కల్పించింది.  ఆంధ్ర ప్రదేశ్ నుంచి తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి, ఏఐసీసీ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి, తెలంగాణ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి రాపోలు ఆనందభాస్కర్‌లను పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా ఖరారు చేసింది. రాష్ట్రానికి చెందిన ఈ నలుగురు, ఇతర రాష్ట్రాలకు చెందిన మరో ఆరుగురు అభ్యర్థుల పేర్లను కలిపి మొత్తం 10మందితో జాబితాను విడుదల చేశారు. రాష్ట్రానికి సంబంధించి తొలుత చిరంజీవి, రేణుకాచౌదరి, పాల్వాయి గోవర్దన్‌రెడ్డి పేర్లను ప్రకటించిన హైకమాండ్.. ఆ తరువాత కొద్దిసేపటికి నాలుగో అభ్యర్ధిగా అనూహ్యంగా రాపోలు పేరును ప్రకటించింది. నాలుగో సీటును రాష్ట్రేతరులకు కేటాయించడం ఆనవాయితీగా వస్తుండటంతో ఆ సీటు కోసం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి బి.కె.హరిప్రసాద్, బీహార్‌కు చెందిన షకీల్ అహ్మద్, కర్ణాటకకు  చెందిన మాజీ రైల్వే మంత్రి జాఫర్ షరీఫ్‌లు తీవ్రంగా ప్రయత్నించినా చివరకు నిరాశే ఎదురైంది. రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రేతర సంప్రదాయాన్ని పక్కనపెట్టి నాలుగు సీట్లనూ రాష్ట్రానికే కేటాయించినట్లు హైకమాండ్ పెద్దలు పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ నుండి సిఎం రమేష్, దేవేందర్ గౌడ్
ఇక తెలుగుదేశం పార్టీ  సిఎం రమేష్, దేవేందర్ గౌడ్ పేర్లను ఖరారు చేసింది. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో   తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో వీరి  పేర్లను  ఖరారు  చేసింది. .
కె.కె.నిర్వేదం
రాజ్యసభ సీటు రాదని తనకు ముందే తెలుసనని కాంగ్రెస్ సీనియర్ నేత కె. కేశవరావు చెప్పారు. ఈ విషయంలో తనకు బాధలేదన్నారు. తెలంగాణ గురించి మాట్లాడడం వల్లే పదవి రాలేదనన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. తెలంగాణపై రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పదవి రాకపోయినా తెలంగాణ ప్రజల ఆకాంక్షను ముందుకు తీసుకెళతానని చెప్పారు. తనకు కావాల్సింది పదవులు కాదు, తెలంగాణ అని అన్నారు. తనపై అధిష్టానానికి ఎటువంటి వ్యతిరేకత లేదన్న నమ్మకాన్ని కేశవరావు వ్యక్తం చేశారు. హైకమాండ్ నిర్ణయాన్నితప్పుబట్టబోనని అన్నారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...