Sunday, March 25, 2012

తెలంగాణ హామీని నిలబెట్టుకోలేకపోవడం వల్లనే ఓటమి

హైదరాబాద్,మార్చి 25:  తెలంగాణ ఏర్పాటు కోసం పార్లమెంట్‌లోనే తాడో పేడో తేల్చుకుంటామని తెలంగాణ ప్రాంత ఎంపీలు అన్నారు. మంత్రి జానారెడ్డి నివాసంలో రాష్ట్ర ఎంపీలు సమావేశమయ్యారు. సమావేశమనంతరం ఎంపీలు మందా జగన్నాథం, ఎస్ రాజయ్య, గుత్తా సుఖేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ...సీమాంధ్రుల కుట్రవల్లే తెలంగాణ ఏర్పాటులో ఆలస్యమవుతున్నదని ది అని అన్నారు. తెలంగాణ హామీని నిలబెట్టుకోలేకపోవడం వల్లనే ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఓటమి పాలయ్యామని వారు తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు హామీ ఇచ్చిన అన్ని పార్టీలు భోజ్యానాయక్ మృతికి బాధ్యత వహించాలన్నారు. ఉప ఎన్నికల్లో ఓటమికి బాధ్యత సీనియర్లది కాదని, ముఖ్యమంత్రి మార్పు, పీసీసీ మార్పు అంశాల్ని పార్టీ అధిస్టానం చూసుకుంటుందని వారు తెలిపారు.
భోజ్యానాయక్‌దే చివరి ఆత్మహత్య కావాలి: కేసీఆర్
 తెలంగాణ రాష్ట్ర సాధనలో భోజ్యానాయక్‌దే చివరి ఆత్మహత్య కావాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కే చంద్రశేఖరరావు అన్నారు. తెలంగాణ కోసం ఎవరూ కూడా ఆత్మహత్యలకు పాల్పడవద్దని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఉద్యమాన్ని కొనసాగిస్తామని, తెలంగాణ రాష్ట్ర సాధన అనే గమ్యాన్ని త్వరలోనే చేరుకుంటామన్నారు. తెలంగాణ అంశం పై  పార్లమెంట్‌ను స్తంభింప చేస్తామని అసెంబ్లీలో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు పోరాటం చేస్తారని అన్నారు.
ముగిసిన భోజ్యానాయక్ అంత్యక్రియలు
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు ఆర్పించిన భోజ్యానాయక్ అంత్యక్రియలు వ వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలం వీరారెడ్డి తండాలో ముగిసాయి. భోజ్యానాయక్ అంత్యక్రియల్లో భారీ ఎత్తున తెలంగాణవాదులు, టీఆర్‌ఎస్ నేతలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మహత్యలకు పాల్పడవద్దని పలువురు తెలంగాణవాదులు ప్రజలకు, విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...