Saturday, March 24, 2012

అతిత్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ ----చిరుకు చోటు...

న్యూఢిల్లీ,మార్చి 24:  రాజ్యసభకు ఎన్నికైన చిరంజీవిని  కేంద్ర మంత్రి పదవి వరించనున్నది.  ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఏప్రిల్ రెండోవారంలో మంత్రి వర్గ విస్తరణ చేపట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. .  రాష్ట్రం నుంచి చిరంజీవితో పాటు మంత్రి వర్గంలో చోటు కల్పించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికలను సమర్థంగా ఎదుర్కోవడానికి వీలుగా రాష్ట్రానికి కేంద్ర మంత్రి వర్గంలో ప్రాధాన్యం లభించవచ్చని చెబుతున్నారు. 2009 ఎన్నికలకు ముందు కేంద్ర మంత్రి వర్గ విస్తరణ చేశారు. అప్పుడు రాష్ట్రానికి ఎక్కువ ప్రాధాన్యం కల్పించారు. అదే ఫార్ములాను ఇప్పుడు కూడా అనుసరించాలనే ఉద్దేశంతో కాంగ్రెసు అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణకు చెందిన ఇద్దరికి కేంద్ర మంత్రి వర్గంలో చోటు కల్పించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు కేంద్ర మంత్రి వర్గంలో ఎస్ జైపాల్ రెడ్డి ఒక్కరే తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి వర్గంలో ఉన్నారు.  రాష్ట్రానికి చెందిన మిగతావారంతా సహాయ మంత్రులు కాగా, జైపాల్ రెడ్డి ఒక్కరిదే క్యాబినెట్ హోదా. అయినా , తెలంగాణకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వడం ద్వారా వచ్చే ఎన్నికలను ఎదుర్కోవాలనే ఉద్దేశంతో కాంగ్రెసు ఉన్నట్లు చెబుతున్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడిన పార్లమెంటు సభ్యుడు హరీష్ రావత్‌కు కూడా కేంద్ర మంత్రి వర్గంలో చోటు కల్పిస్తారని అంటున్నారు. ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పేలవ ఫలితాల నేపథ్యంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి పార్టీని సన్నద్ధం చేయడం లో  భాగంగా  కేంద్ర మంత్రి మండలిలో భారీగా మార్పుచేర్పులు చేయాలని అధిష్టానం భావిస్తోంది. ముఖ్యంగా ఈ ఏడాదిలో గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికలతోపాటు వచ్చే ఏడాది కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలు, 2014లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఈ చర్య చేపట్టనుంది. మరోవైపు దేశంలోని లోక్‌సభ స్థానాల్లో దాదాపు సగం సీట్లు కలిగి ఉన్న ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడులలో పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...