Thursday, March 22, 2012

యూపీఏ సర్కార్ కు బొగ్గు మసి...!

న్యూఢిల్లీ,మార్చి 22 : యూపీఏ సర్కార్ కు మెడకు మరో ఉచ్చు పడింది.బొగ్గు గనులు వేలం వేయకపోవటం ద్వారా ప్రభుత్వానికి దాదాపు పది లక్షల కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు కాగ్ తన నివేదికలో తెలిపింది. దీనిపై తక్షణం చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు గురువారం నాడు పార్లమెంట్ కార్యకలాపాలను స్తంభింపచేశాయి. ప్రశ్నోత్తరాలను రద్దు చేసి బొగ్గు కుంభకోణంపై చర్చ జరపాలని లోక్ సభలో విపక్షాలన్ని డిమాండ్ చేశాయి. దీంతో స్పీకర్ మీరాకుమార్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చర్చ జరగాల్సిందేనంటూ బీజేపీ సభలో పట్టుబట్టింది. దాంతో సభలో గందరగోళం నెలకొంది. దాంతో చైమన్  సమావేశాలను పదిహేను నిమిషాలు వాయిదా వేశారు. వాయిదా అనంతరం సభ ప్రారంభం అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. దాంతో రాజ్యసభ కూడా మధ్యాహ్నం 12 గంటలవరకూ వాయిదా పడింది. బొగ్గు కుంభకోణం 2జీ స్పెక్ట్రమ్ కంటే పెద్దదని బీజేపీ ఆరోపించింది. ఈ భారీ కుంభకోణంలో ప్రధాని కార్యాలయానికి ప్రమేయముందని మండిపడింది. తక్షణమే మన్మోహన్ సింగ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...