Monday, March 19, 2012

విరాట్విజయం....ఫైనల్ ఆశలు సజీవం

ఢాకా,మార్చి 18: బంగ్లాదేశ్ చేతిలో ఓటమితో భంగపడ్డ భారత్... తన ప్రతాపాన్ని పాకిస్థాన్‌పై చూపించింది. ఏకంగా తమ వన్డే చరిత్రలోనే అత్యధిక విజయలక్ష్యానీ లక్ష్యాన్ని (330) ఛేదించింది. విరాట్ కోహ్లి విజృంభణ తో భారత్ ఆరు వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది.  చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో భారత్ తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఓడించి  రేసులో నిలిచింది. ఇక టోర్నీలోని ఆఖరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై శ్రీలంక గెలిస్తే భారత్ ఫైనల్‌కు చేరుతుంది. ఒకవేళ బంగ్లాదేశ్ గెలిస్తే... పాకిస్థాన్‌ను ఓడించామన్న  తృప్తి మిగులుతుంది. 330 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ 47.5 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. విరాట్ కోహ్లి (148 బంతుల్లో 183; 22 ఫోర్లు, 1 సిక్సర్)  ఇన్నింగ్స్కు, సచిన్ (48 బంతుల్లో 52; 5 ఫోర్లు, 1 సిక్సర్), రోహిత్ శర్మ (83 బంతుల్లో 68; 5 ఫోర్లు, 1 సిక్సర్) ల నిలకడ తోడవడంతో భారీ లక్ష్యాన్ని భారత్  ఛేదించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 329 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు మహ్మద్ హఫీజ్ (113 బంతుల్లో 105; 9 ఫోర్లు, 1 సిక్సర్), నాసిర్ జంషేడ్ (104 బంతుల్లో 112; 10 ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీలతో చెలరేగి ఆడారు. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు ఏకంగా 224 పరుగులు జోడించారు. యూనిస్‌ఖాన్ (34 బంతుల్లో 52; 6 ఫోర్లు) వేగంగా ఆడి అర్ధసెంచరీ చేశాడు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...