3 రోజులు నగల వ్యాపారం బంద్
న్యూఢిల్లీ, మార్చి 17: బ్రాండెడ్ బంగారం ,వెండి దిగుమతులపై కస్టంస్ డ్యూటీ పెంచడంపై దేశవ్యాప్తంగా బంగారం వర్తకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. 17,18,19 తేదీలలో 3 రోజులు నగల వ్యాపారం బంద్ చేస్తున్నట్లు అఖిల భారతీయ రత్నాలు,ఆభరణాల వాణిజ్య సమాఖ్య ప్రకటించింది. జంటనగరాల్లో బంగారం వర్తకులు ఈ బంద్‌కు మద్ధతు తెలిపారు. మూడు రోజుల పాటు నగల దుకాణాలు మూసివేయాలని నిర్ణయించారు. 1962-92 మధ్య కాలంలో కూడా ఇలాగే చేయడం వలన పరిశ్రమ కుదేలైందని, దీంతో ఆభరణాల దుకాణాలను మూసివేయాల్సిన పరిస్ధితి ఏర్పడిందని , ఇప్పటికే పెరిగిన బంగారం ధరతో సతమతమౌతున్న తమకు పన్ను పోటునుంచి ఊరట కలిగించాలని జ్యూయెలరీ అసోసియేషన్ లు విజ్ఞప్తి చేస్తున్నాయి.
Comments