Monday, March 19, 2012

ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతం: 21న ఫలితాలు

హైదరాబాద్,మార్చి 18:ఏడు అసెంబ్లీ స్థానాలకు ఆదివారం జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.  రికార్డు స్థాయిలో అత్యధికంగా కోవూరు నియోజకవర్గంలో 84 శాతం పోలింగ్ నమోదైందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు.  కొల్లాపూర్ నియోజకవర్గంలో 75 శాతం, మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో 70 శాతం, నాగర్ కర్నూలు నియోజకవర్గంలో 70 శాతం, కామారెడ్డి నియోజకవర్గంలో 68 శాతం, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో 64 శాతం, ఆదిలాబాద్ నియోజకవర్గంలో 61 శాతం పోలింగ్ జరిగిందని వివరించారు. ఈ శాతాల్లో మార్పులు చేర్పులు ఉండొచ్చన్నారు. ఏడు చోట్ల ఈవీఎంల్లో సాంకేతిక సమస్యలు తప్ప మిగతా అన్ని చోట్ల పోలింగ్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిసినట్లు పేర్కొన్నారు. కొన్నిచోట్ల జాబితాల్లో పేర్లు లేవనే ఫిర్యాదులు వచ్చాయని, వాటిపై విచారణ జరిపిస్తామని, ఉద్దేశపూర్వకంగా పేర్లను తొలగిస్తే అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. వరంగల్‌లో కాంగ్రెస్ ఎంపీ రాజయ్య నియమావళికి విరుద్ధంగా ప్రచారం చేసినట్లు ఫిర్యాదు వచ్చిందని, దీనిపై కలెక్టర్ నుంచి పూర్తి స్థాయి నివేదిక కోరినట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న ట్రిపుల్ ఐటీ విద్యార్థులతోపాటు ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించిన కలెక్టర్లు, ఎస్పీలు, పోలింగ్ సిబ్బందికి భన్వర్‌లాల్ అభినందనలు తెలియజేశారు. ఉప ఎన్నికలు జరిగిన ఏడు స్థానాల ఓట్ల లెక్కింపు ఈ నెల 21వ తేదీ ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుందని భన్వర్‌లాల్ చెప్పారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...