Monday, March 12, 2012

జగన్ ఆస్తుల కేసులో ఆరుగురు అమాత్యులకు సుప్రిం నోటీసులు

న్యూఢిల్లీ,మార్చి 12:  వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు లో సుప్రీం కోర్టు సోమవారం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఆరుగురు మంత్రులు, ఎనిమిది మంది ఐఏఎస్‌లను విచారించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మంత్రులకు, ఐఏఎస్ అధికారులకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. మంత్రులు గీతా రెడ్డి, కన్నా లక్ష్మీ నారాయణ, పొన్నాల లక్ష్మయ్య, మోపిదేవి వెంకట రమణ, ధర్మాన ప్రసాద రావు, సబితా ఇంద్రా రెడ్డిలకు , ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మి, శామ్యూల్, రత్నప్రభ, ఎస్వీ ప్రసాద్, ఆదిత్యనాథ్, మన్మోహన్ సింగ్, సివిఎస్‌కె శర్మ, శ్యాంబాబు తదితర అధికారులకు  నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని వారిని కోర్టు ఆదేశించింది. మంత్రులను ప్రశ్నించకపోవడంపై వివరణ ఇవ్వాలని సిబిఐని కూడా కోర్టు ఆదేశించింది. జగన్ ఆస్తుల కేసులో జగన్ ఒక్కడినే విచారించడం సరికాదని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన సుధాకర్ రెడ్డి అనే న్యాయవాది వేసిన ఆయన పిటిషన్‌పై   కోర్టు  మంత్రులు, ఐఏఎస్ అధికారులకు నోటీసులు జారీ చేసింది. సుధాకర్ రెడ్డి అంతకుముందు ఇదే విషయంపై హైకోర్టులో కేసు వేశారు. హైకోర్టు ఆయన పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీంతో అతను సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వైఎస్సార్ హయాంలో 26 వివాదాస్పద జీవోల విడుదల వెనుక మంత్రులు, అధికారుల ప్రమేయముందని పిటిషనర్ ఆరోపించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...