ఒబామా కొలువులో మరో ఇద్దరు ఎన్నారైలు
వాషింగ్టన్,మార్చి 11: ఇద్దరు ప్రముఖ భారతీయ అమెరికన్‌లను ఆ దేశ అధ్యక్షుడు ఒబామా కీలక పదవుల్లో నియమించారు. ప్రస్తుతం హెన్రీ ఫోర్డ్లో చీఫ్ లెర్నింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న.పౌల్ గంగోపాధ్యాయను నేషనల్ మ్యూజియం అండ్ లైబ్రరీ సర్వీస్ బోర్డులో సభ్యునిగా నియమించగా, ఒరిగన్ స్టేట్ యూనివర్శిటీలోని అగ్రికల్చర్ సైన్స్ కళాశాలలో డీన్‌గా, డెరైక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మరో ఎన్నారై సోనీ రామస్వామిని అమెరికా వ్యవసాయ విభాగమైన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ (ఎన్‌ఐఎఫ్‌ఏ) డెరైక్టర్‌గా నియమించారు. వీరి నియామకంతో వైట్‌హౌస్‌లో కొత్తగా కీలక పదవులు చేపట్టిన భారతీయుల సంఖ్య ఆరుకు చేరింది.
Comments