Friday, March 9, 2012

ద్రావిడ్ అస్త్రసన్యాసం... క్రికెట్ కెరీర్‌కు రిటైర్మెంట్

బెంగళూర్,మార్చి 9:  టీమిండియా మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ క్రికెట్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. బెంగళూర్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ద్రావిడ్ 164 టెస్టు మ్యాచులు ఆడాడు. 13,288 పరుగులు చేశాడు. టెస్టుల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 36 సెంచరీలు, టెస్టుల్లో 63 అర్థ సెంచరీలు చేశాడు. తన 16 ఏళ్ల క్రికెట్ కెరీర్ ఇంత విజయవంతంగా ముగుస్తుందని ఎప్పుడు ఊహించలేదని అన్నారు. తనను అభిమానించిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. నేటి కాలమంతా యువకులదే అని, చరిత్ర సృష్టించే సత్తా వీరి సొంతమని ఆయన అన్నారు.తప్పుకోవాల్సిన సమయం వచ్చిందని, యువకులకు అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అద్భుతమైన యుగంలో తాను భాగస్వామిని అయినందుకు సంతోషంగా ఉందని ఆయన అన్నారు. విచారంతోనే తప్పుకుంటున్నా గౌరవంగా ఉందని ఆయన అన్నారు. తన నిర్ణయాన్ని సచిన్ స్వాగతించినట్లు ద్రావిడ్ చెప్పారు. క్రికెట్ జీవితంలో పొగడ్తలూ ఉన్నాయి, విమర్శలూ ఉన్నాయని ఆయన అన్నారు. టీమిండియాలో విభేదాలున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు. టీమిండియాకు ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందని చెప్పారు. తన నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తారని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...