అలనాటి బాలీవుడ్ నటుడు జాయ్ ముఖర్జీ మృతి
ముంబై,మార్చి 9: అలనాటి బాలీవుడ్ నటుడు జాయ్ ముఖర్జీ ముంబైలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 73 సంవత్సరాలు. మూడు రోజుల క్రితం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. ప్రముఖ నిర్మాత, ఫిల్మాలయా స్టూడియో అధినేత సశాధర్ ముఖర్జీ కుమారుడు. దేబ్ ముఖర్జీ, షోము ముఖర్జీలు జాయ్ సోదరులు. ప్రముఖ బాలీవుడ్ తారలు కాజోల్, తనిష్ట తల్లి తనూజాను జాయ్ సోదరుడు షోమూ పెళ్లాడారు. 1960 సంవత్సరంలో ప్రముఖ నటి సాధన సరసన లవ్ ఇన్ సిమ్లా అనే చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి జాయ్ అడుగుపెట్టారు. ఆతర్వాత ఫిర్ వోహి దిల్ లాయా హూ, లవ్ ఇన్ టోక్యో, జిద్ది, ఏక్ ముసాఫిర్ ఏక్ హసీనా లాంటి పలు విజయవంతమైన చిత్రాలతో అభిమానుల్ని ఉర్రూతలూగించారు. అంతేకాక లవ్ ఇన్ బాంబే, ఛైలా బాబు, సాంజ్ కీ భేలా, ఉమీద్ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.

Comments