Wednesday, March 28, 2012

నెత్తు రోడిన గడ్చిరోలి...నక్సల్స్ మందుపాతరకు 12 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు బలి

న్యూఢిల్లీ,,మార్చి 28:   మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో నక్సల్స్ మళ్లీ భద్రతా బలగాలపై భారీ దాడికి పాల్పడ్డారు. మంగళవారం సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సును మందుపాతరతో పేల్చేశారు. ఈ ఘటనలో 12 మంది జవాన్లు చనిపోగా, మరో 28 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. సీఆర్పీఎఫ్ 192వ బెటాలియన్ డి కంపెనీకి చెందిన 40 మంది జవాన్లు కూంబింగ్‌కు వెళ్లి బస్సులో తిరిగొస్తుండగా ధనోరా తాలూకా పుస్తోలా గ్రామం సమీపంలో ఉదయం 11.30 గంటల ప్రాంతంలో నక్సల్స్ మందుపాతర పేల్చారు. దీంతో బస్సు కొన్ని మీటర్ల మేర ఎగిరి కిందపడి తునాతునకలైంది. 12 మంది జవాన్లు అక్కడికక్కడే చనిపోయారు. పేలుడు తర్వాత మంటలు చెలరేగాయి. దీంతో కొందరికి కాలిన గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఎనిమిది మందిని రెండు ప్రత్యేక హెలికాప్టర్లలో నాగ్‌పూర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మిగిలిన 20 మంది క్షతగాత్రులకు గడ్చిరోలి జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. సీఆర్పీఎఫ్ చీఫ్ కె.విజయ్‌కుమార్ మహారాష్ట్ర పర్యటనలో భాగంగా గడ్చిరోలిలో ఉన్న నేపథ్యంలో నక్సల్స్ దాడికి పాల్పడడం గమనార్హం. ఈ దుశ్చర్యకు 40 కేజీల పేలుడు పదార్థాలు వాడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...