నాటా ఆధ్వర్యంలో మే 6న న్యూజెర్సీలో జాబ్‌మేళా,
హైదరాబాద్,మార్చి 28: నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (నాటా) ఆధ్వర్యంలో మే 6వ తేదీన అమెరికాలోని న్యూజెర్సీలో జాబ్‌మేళా, ఇమిగ్రేషన్ అంశంపై సదస్సు జరగనుంది. 2055 లింకన్ హైవే (రూట్ 27) ఎడిసన్‌లోని క్రౌన్ ప్లాజా లో ఉద్యోగ మేళా, సదస్సు ఉంటాయని అసోసియేషన్ ప్రతినిధి పేర్కొన్నారు. సదస్సును ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు నిర్వహిస్తారు. ఇతర వివరాల కోసం www.nataus.org వెబ్‌సైట్‌ను చూడాల్సిందిగా అసోసియేషన్ ప్రతినిధి తెలిపారు.
Comments