Wednesday, March 28, 2012

రష్యా, చైనా, బంగ్లాదేశ్‌ ఎంబీబీఎస్ డిగ్రీలు ఇక్కడ చెల్లవ్...

న్యూఢిల్లీ,,మార్చి 28:   భారత సంతతి విద్యార్థులకు అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు జారీచేసిన మెడికల్ ఎండీ డిగ్రీలకు మాత్రమే దేశంలో గుర్తింపు ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి గులాంనబీ ఆజాద్ స్పష్టంచేశారు. అలాగే విదేశీ ఎంబీబీఎస్ డిగ్రీలకు దేశంలో గుర్తింపు లేదని తెలిపారు.  రష్యా, చైనా, బంగ్లాదేశ్‌లలో ఎంబీబీఎస్ కోర్సులను పూర్తిచేసుకున్న భారత విద్యార్థులు వెంటనే ఇక్కడ ప్రాక్టీస్ ప్రారంభించడం కుదరదని ఆజాద్ రాజ్య సభలో తేల్చిచెప్పారు. ముందుగా జాతీయ పరీక్షల నిర్వహణ బోర్డు(ఎన్‌బీఈ) చేపట్టే స్క్రీనింగ్ టెస్త్లో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. దేశంలో వైద్యుల కొరత ఉందని, మెడికల్ కళాశాలల పెంపునకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆజాద్ తెలిపారు. కళాశాలల ఏర్పాటు నిబంధనల్లో పలు మార్పులు తెచ్చినట్లు వివరించారు. పట్టణాల్లో కొత్త మెడికల్ కళాశాలల ఏర్పాటుకు గతంలో 25 ఎకరాల భూమి అవసరంకాగా, ప్రస్తుతం 10 ఎకరాలకు తగ్గించినట్లు చెప్పారు. అలాగే మెడికల్ కాలేజీల్లో పడకల సామర్థ్యాన్ని సైతం కుదించినట్లు వివరించారు. గత మూడేళ్లలో దేశవ్యాప్తంగా 46 కొత్త మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వైద్య కళాశాలల్లో అధ్యాపకుల కొరతను అధిగమించేందుకు చర్యలు చేపట్టినట్లు ఆజాద్ తెలిపారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...