దడదడలాడిస్తున్న ‘ థానే '
విశాఖపట్నం,డిసెంబర్ 28: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘థానే’ పెను తుపానుగా మారింది. చెన్నైకి తూర్పు ఆగ్నేయ దిశలో 500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతయిన థానే రాగల 24 గంటల్లో మరింత తీవ్రరూపం దాల్చి, శుక్రవారం కడలూరు-శ్రీహరికోట మధ్య తీరం దాటే అవకాశముంది. తుపాను ప్రభావంతో గురువారం నుంచి సముద్రం తీరం వెంబడి 45-50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, తమిళనాడు, దక్షిణకోస్తా, చిత్తూరు జిలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తుపాను హెచరిక కేంద్రం తెలిపింది. తుపాను తీరం దాటే సమయంలో తీరం వెంట 90-110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచవచ్చని , మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Comments