అంగారక గ్రహం శిలలపై గాంధీజీ రూపం
లండన్ ,జూన్ 14: అంగారక గ్రహంపై ఉన్న శిలలపై గాంధీజీ రూపాన్ని గుర్తించినట్లు ఇటలీ అంతరిక్ష సంస్థ ప్రకటించింది. 'ఐరోపా మార్స్ ఆర్బిటర్' ఇటీవల భూమికి పంపిన చిత్రాల్లో ఈ రూపం స్పష్టంగా కనిపించినట్లు 'మట్టేవో లన్నెవో' సంస్థ తెలిపింది. ఆంగారకుడిపై మనిషి ఆకారాన్ని గుర్తించడం ఇదే తొలిసారి కాదు. 1976, జులైలో అమెరికాకు చెందిన వికింగ్-1 ఆర్బిటర్ తీసిన చిత్రాల్లోనే ఇది వెలుగు చూసింది. ధూళితో నిండిన అంగారకుడి ఉపరితలంపై ఓ శిల మనిషి ఆకారంలో ఉందని అప్పట్లో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. గతేడాది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) 'హై రైజ్' కెమెరా కూడా మానవ రూపాన్ని చిత్రీకరించింది. ఇది ఓ పెద్దశిలఅని స్పష్టం చేసింది.
Comments