న్యూఢిల్లీ,ఫిబ్రవరి 5: నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ మిస్టర్‌క్లీన్ ఇమేజ్‌ను దెబ్బ తీసి 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయానికి దారి తీసిన బోఫోర్స్ కుంభకోణంలో ప్రధాన పాత్రధారి అట్టావియో కత్రోకీకి సీబీఐ విజయవంతంగా విముక్తి ప్రసాదించింది. ఇటలీ వ్యాపారవేత్త, బోఫోర్స్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న కత్రోకీని ప్రాసిక్యూషన్ నుంచి ఉపసంహరించాలన్న సీబీఐ విజ్ఞప్తికి ఢిల్లీ చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు ఆమోదం తెలిపింది. కత్రోకీపై విచారణను ఇంకా సాగదీయడంలో అర్థంలేదన్న సీబీఐ వాదనతో ఏకీభవించింది. ఈ సందర్భంగా ‘ఒక కేసుకు తర్కబద్ధమైన పరిష్కారం సాధ్యం కానప్పుడు.. దానిని వదిలేయడమే ఉత్తమం’ అని ఒక హిందీ సినిమా పాటను ఉటంకిస్తూ మేజిస్ట్రేట్ వినోద్ యాదవ్ వ్యాఖ్యానించారు. కత్రోకీని క్యూగా సంబోధిస్తూ.. ఆయనను భారత్‌కు రప్పించే భారాన్ని దేశం ఇకపై భరించజాలదని, ఇప్పటికే రూ.250 కోట్లను అందుకు ఖర్చయ్యాయని.. అందువల్ల ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ కేసు నుంచి కత్రోకీని తొలగించడమే ఉత్తమమని భావిస్తున్నామని 73 పేజీల తీర్పులో పేర్కొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
హైదరాబాద్,నవంబర్ 1: తెలంగాణావాదుల నిరసనలు,సీమాంధ్రుల వుత్సవాలతో రాష్ట్రావతరణ దినోత్సవం సోమవారం ప్రశాంతంగా ముగిసింద్. తెలంగాణ జిల్లాలో ప్రభుత...
-
హైదరాబాద్, జనవరి 22: మహా నటుడు అక్కినేని నాగేశ్వరరావు మరిలేరు. మంగళవారం తెల్లవారు ఝామున 2 గంటల సమయంలో ఆయన హైదరాబాద్ కేర్ ఆస్పత్రిలో తుద...
No comments:
Post a Comment