Wednesday, November 10, 2010

మహారాష్ట్ర కొత్త సీఎంగా పృధ్వీరాజ్ చవాన్

న్యూఢిల్లీ,నవంబర్ 10 : మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి పృధ్వీరాజ్ చవాన్‌ను వరించింది. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ బుధవారం మహారాష్ట్ర నూతన సీఎంగా పృధ్వీరాజ్ చవాన్ పేరును ఖరారు చేశారు. దీనితో ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు.పృథ్వీరాజ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. చవాన్ నిర్వహించిన పార్లమెంటరీ వ్యవహారాలు, సైన్ అండ్ టెక్నాలజీ తదితర మంత్రిత్వ శాఖల బాధ్యతలను తాత్కాలికంగా కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి కపిల్ సిబాల్ కు అప్పగిస్తున్నట్లు రాష్టప్రతి కార్యాలయం ప్రకటించింది.


ఇలా వుండగా, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్'ని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ( ఎంపిక చేసింది. ఎన్సీపి అధినేత శరద్ పవార్ కు అజిత్ పవార్ మేనల్లుడు. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపి సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. ఇరు పార్టీల ఒప్పందం ప్రకారం కాంగ్రెస్ పార్టీ వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే, ఎన్సీపికి చెందిన వ్యక్తి ఉప ముఖ్యమంత్రిగా ఉంటారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని మారుస్తున్న తరుణంలో ఎన్సీపి కూడా ఉప ముఖ్యమంత్రిని మార్చాలని నిర్ణయించింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...