Wednesday, November 10, 2010

మళ్ళీ చంచల్‌గూడ జైల్‌కు రామలింగరాజు

హైదరాబాద్ ,నవంబర్ 10: సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు, ఆ సంస్థ మాజీ ఛైర్మన్ రామలింగరాజు బుధవారం నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో లొంగిపోయారు. ఆయనతో పాటు మరో అయిదుగురు నిందితులు కూడా కోర్టులో లొంగిపోయారు. వీరి బెయిల్ ను సుప్రిం కోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఎటువంటి బెయిల్‌కు దరఖాస్తు చేసుకోకుండా జూలై 2011 వరకు రామలింగరాజు జుడీషియల్ కస్టడీలో వుంటారని సీబీఐ డీఐజీ లక్ష్మీనారాయణ తెలిపారు. రాజుతో పాటు ఈ కేసులో లొంగిపోయిన మరో ఐదుగురిని చంచల్‌గూడ సెంట్రల్ జైల్‌కు తరలించారు. లొంగిపోవడానికి మరికొంత సమయం కావాలని సుప్రీంలో చేసిన దరఖాస్తు తిరస్కరించడంతో రామలింగరాజు ప్రత్యేక కోర్టులో లొంగిపోయారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...