Tuesday, November 2, 2010

మహిళా బిల్లుపై సోనియా భరోసా

 న్యూఢిల్లీ,నవంబర్ 2: పార్లమెంట్'లో మహిళా బిల్లుని తప్పనిసరిగా ఆమోదిస్తామని ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ చెప్పారు. ఇక్కడి తల్కటోరా ఇండోర్ స్టేడియంలో జరిగిన ఎఐసిసి సమావేశంలో ఆమె ప్రసంగించారు. కాశ్మీర్ లో  శాంతి నెలకొల్పడమే తమ ధ్యేయమని, అక్కడి పరిస్థితులను లోతుగా అధ్యయనం చేసి, తగిన పరిష్కార కనుగొనేందుకు ఒక అఖిలపక్ష కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు.  కుల, మతాల పేరుతో సమాజాన్ని విడగొట్టడం మంచిదికాదని ఆమె  పరోక్షంగా   బీ.జే.పీ.,   ఆర్.ఎస్.ఎస్. ను హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ విధానాలు సమాజాన్ని విడగొట్టేవికాదని, అన్నివర్గాలను కలుపుకుపోయేవని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తమ ప్రసంగంలో  అన్నారు.  ధరలు పెరుగుదల, ఉద్రవాదంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ధరలను నియంత్రించేందుకు , ఉగ్రవాదాన్ని అదుపు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ఎజెండాలో తాను  ప్రసంగించే అంశం లేకపోయినా, సభ్యుల కోరిక మేరకు ప్రసంగించిన ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ - కాంగ్రెస్ పార్టీ భారతీయులు అందరిదని ,బలహీనవర్గాల కోసం కృషి చేయాలని పార్టీ సభ్యులకు పిలుపు ఇచ్చారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...