Monday, November 8, 2010

భారత్-అమెరికా సంబంధాల వల్ల ప్రపంచానికి మేలు :ఒబామా

న్యూఢిల్లీ,నవంబర్ 8: భారత్ అభివృద్ధికి చిరునామాగా మారుతుందని అమెరికా అధ్యక్షుడు  ఒబామా ఆకాంక్షించారు. పార్లమెంట్ ఉభయ సభల సభ్యులనుద్దేశించి ఒబామా ప్రసంగించారు.  మొదట లోక్'సభ, రాజ్యసభ సభ్యులకు బహుత్ ధన్యవాద్ అంటూ హిందీలో చెప్పి, ఆ తరువాత ఇంగ్లీష్'లో ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు. 'భారత్ లో దీపావళి సంబరాలలో పాల్గొనడం ఆనందంగా ఉంది. నాకు, మిషెల్'కు, అమెరికాకు ఇదో ప్రత్యేక పర్యటన. గాంధీజీ  జీవితం నాకు స్పూర్తి. ఆయా  స్పూర్తితో నేను అధ్యక్షుడిని అయ్యాను. గాంధీ అనే వ్యక్తి తన జీవితాన్ని సందేశంగా ఇవ్వకపోతే అమెరికా అధ్యక్షుడిగా నేను ఈ ప్రసంగం ఇచ్చేవాడిని కాదు. భారత్ ని తొలి విడిదిగా ఎంచుకోవడం యాధృచ్ఛికం కాదు. భారత్ ఆతిధ్య అద్భుతం. వంద కోట్ల మంది ప్రజల ప్రతినిధులతో మాట్లాడటం నాకు గర్వంగా ఉంది. భారత్ ఎదుగుతున్న దేశం కాదు. ఎదిగిన దేశం. భారత్ ఆర్థికాభివృద్ది ప్రశంసనీయమైనది. భారత్ నాగరికత చాలా గొప్పది. భారత్ విజయానికి ప్రజాస్వామ్యమే కారణం. భారత్ జనాభా దేశానికి బలమైన వనరు. భారత్ కు భారతీయులే గొప్పశక్తి. అభివృద్ధికి చిరునామాగా భారత్ మారుతుంది. అతి పెద్ద మధ్యతరగతిని భారత దేశం అందించింది.  ఈ దేశంలో భారత్'లో సమాచార హక్కు చట్టం తీసుకురావడం ఒక విప్లవాత్మకమైన మార్పు.అమెరికాతో మైత్రి సహజమైనదని, అవసరమైనదని భారత్ గుర్తించింది. ఉమ్మడి భద్రతా వ్యవహారాలపై సహకరించుకుంటాం. సవాళ్లను సమిష్టిగా ఎదుర్కొందాం. వైద్యరంగంలో భారత్'కు పూర్తి సహకారం అందిస్తాం. ముంబై కాల్పుల బాధితులకు న్యాయం జరగాలి. భారత్-అమెరికా సంబంధాల వల్ల ప్రపంచానికి మేలు జరుగుతుంది. భారత్ కు అమెరికా ఎప్పుడూ అండగా ఉంటుంది. భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి కృషి చేస్తాం. ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్ ఎదగాలి.  ఉగ్రవాదం పేరిట అమాయకుల ఊచకోతను సహించం. పాకిస్తాన్ లో ఉగ్రవాద శిబిరాలను వదిలిపెట్టం.  ఉగ్రవాదం పాకిస్తాన్ ప్రజలకు కూడా ప్రమాదకరమైనదే.' అన్నారు ఒబామా. పార్లమెంట్'లోకి అడుగుపెట్టిన ఒబామాకు ఉప రాష్ల్రపతి హమీద్ అన్సారీ, లోక్'సభ స్పీకర్ మీరాకుమార్, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ స్వాగతం పలికారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...