Friday, November 12, 2010

పార్టీ అందోళన కార్యక్రమంలో పాల్గొన్న రోశయ్య

హైదరాబాద్,నవంబర్ 12 : సోనియాగాంధీపై ఆర్‌ఎస్‌ఎస్ మాజీ చీఫ్ సుదర్శన్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాష్టవ్య్రాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు చేపట్టింది. హైదరాబాద్ బషీర్‌బాగ్ వద్ద కాంగ్రెస్ జరిపిన ఆందోళన కార్యక్రమంలో ముఖ్యమంత్రి హోదాలో రోశయ్య తొలిసారిగా పాల్గొన్నారు. సోనియాపై వచ్చిన విమర్శలను ప్రతి భారతీయుడు ఖండించాలని ఈ సందర్భంగా రోశయ్య పిలుపునిచ్చారు. పీసీసీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్, పలువురు ఎమ్మెల్యేలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. కాగా, ముఖ్యమంత్రి ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొనడం విమర్శలకు దారి తీసింది, రాష్ట్రాన్ని నడపాల్సిన ముఖ్యమంత్రి కె.రోశయ్య రోడ్ల పైకి వచ్చి ధర్నా చేయటం సిగ్గుచేటు అని టీడీపీ సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. చట్టాన్ని ఉల్లంఘించిన రోశయ్యకు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే నైతిక అర్హతలేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. రోశయ్యపై కేసు నమోదు చేసి విచారించాలని ఆయన డిమాండ్ చేశారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...