Saturday, November 6, 2010

భారత్ ప్రగతిని ప్రశంసించిన ఒబామా

ముంబై,నవంబర్ 6: వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో భారత్ ఒకటని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు.  భారత్-అమెరికా వాణిజ్య సదస్సులో ఆయన ప్రసంగించారు.  భారత్ లో పెట్టుబడులు పెట్టండని ఆయన పిలుపు ఇచ్చారు. వచ్చే అయిదేళ్లలో భారత్ కు ఎగుమతులు పెంచడం లక్ష్యంగా ఉండాలన్నారు. కేవలం అమెరికాలో మాత్రమే ఉద్యోగాలు రావని, భారత్ లో కూడా వస్తాయన్నారు. అమెరికాతో వ్యాపార భాగస్వామ్యంలో భారత్ 12వ స్థానంలో ఉన్నట్లు తెలిపారు. రెండు దేశాలకు ఉపయుక్తం అయ్యేలా భాగస్వామ్యాలు నెలకొల్పుకోవచ్చన్నారు.భారత్ తో 10 బిలియన్  డాలర్ల ఒప్పందాలను ఒబామా ప్రకటించారు.  ఈ సదస్సులో భారత్, అమెరికాలకు చెందిన సిఇఓలు రెండు వందల మందికిపైగా హాజరైయ్యారు.అంతకు ముందు ముంబై దాడుల మృతుల స్మృతి చిహ్నాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆ తరువాత విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ,  ముంబై దాడులు దురదృష్టకరమని,   ఈ దాడులను ఎదుర్కొన్న తీరుతో భారత్ శక్తి ఏమిటో  ప్రపంచానికి తెలిసిందని అన్నారు. భారత్'కురావడం తనకు లభించిన అరుదైన గౌరవం అని ఆయన పేర్కొన్నారు. తాజ్ హొటల్'లో తన బస ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతోందన్నారు. తీవ్రవాద వ్యతిరేక కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని ఆయన అన్నారు. తన పర్యటన ఉగ్రవాదానికి ఒక హెచ్చరికలాంటిదని ఒబామా అభివర్ణించారు.  ఉగ్రవాద నిర్మూలనలో భారత్ కు అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...