Thursday, November 4, 2010

సూపర్ సైక్లోన్ అవకాశం లేదన్న వాతావరణ కేంద్రం

హైదరాబాద్,నవంబర్ 4: భారీ వర్షాల కారణంగా 35 మంది మృతి చెందారని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. విశాఖపట్టణం జిల్లాలో 13 మంది మరణించారు. భారీ వర్షాలకు 10,322ఇళ్లు దెబ్బ తిన్నాయని, 1,39,289 ఇళ్లు నీట మునిగాయి. 2,83,566 హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లినట్టు ప్రభుత్వం తెలిపింది. రూ. 1154.16 కోట్ల సాయం అందించాలని రాష్ర్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఇలావుండగా,అండమాన్ సముద్రంలో ఏర్పడిన వాయుగుడం సూపర్సైక్లోంగా మారే అవకాశం లేదని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది ప్రస్తుతం విశాఖ, చెన్నై తీరాలకు 1200 కి.మి. పైగా దూరంలో వున్నందున దీని ప్రభావాన్ని ఇప్పుడే అంచనా వేయలేమని పేర్కొంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...