Monday, November 1, 2010

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై రోశయ్య భరోసా

పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న రోశయ్య
హైదరాబాద్,నవంబర్ 1: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగు పడిందని ముఖ్యమంత్రి రోశయ్య అన్నారు. ఈ ఆర్థిక సంవత్సం మొదటి ఆరునెలల్లో ప్రభుత్వ ఆదాయం గత ఏడాది కంటే 25 శాతం పెరిగిందన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ , వైఎస్ మరణం, ప్రాంతీయ ఉద్యమాల ప్రభావం వల్ల గత ఏడాది ఆర్థిక ప్రగతి అంతంత మాత్రంగానే ఉందన్నారు. రాష్ట్రంలో గ్రామీణ అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని, కేంద్ర సాయంతో ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని చెప్పారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ప్రభుత్వం ముందున్న ప్రధాన లక్ష్యమన్నారు. తల్లిదండ్రులు తెలుగుభాష మాధుర్యాన్ని పిల్లలకు అలవాటు చేయాలన్నారు. 2013లో కాకతీయ ఉత్సవాలను నిర్వహిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో  అలరించాయి.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...