వృద్ధులకు రాష్ట్రప్రభుత్వం చేయూత: కొత్త పధకం 'ఆసరా'

హైదరాబాద్,అక్టోబర్ 31:   రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లోని వృద్ధులకు చేయూత నిచ్చేందుకు ప్రభుత్వం కొత్తగా ‘ఆసరా’ పథకాన్ని నవంబరు 1 నుంచి ప్రారంభిస్తోంది. ఇందులో భాగంగా 7-50 మంది ఒక గ్రూపుగా ఉండేలా 60 ఏళ్లు పైబడిన వృద్ధులతో ప్రత్యేక సంఘాలు ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే హైదరాబాద్‌లో అమలవుతున్న ఈ ‘ఆసరా’ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తారు. రాష్ర్టంలో ఉన్న పట్టణ జనాభాలో 10-15 శాతం వృద్ధులున్నట్లు అధికారులు గుర్తించారు. వీరికి బ్యాంకు లింకేజీలు కల్పించడం, అవసరాన్ని బట్టి రుణాలు ఇప్పించడం వంటివి చేపడతారు. వారి కోసం తరచూ హెల్త్ క్యాంపులు నిర్వహించడం, వ్యాధి తీవ్రతను బట్టి శస్త్ర చికిత్సలు చేయించడం వంటి పనులు చేపడతారు. ఆపదలో ఉన్న వృద్ధులకు పోలీసు రక్షణ , న్యాయ సహాయం అందించడం వంటి అనేక కార్యక్రమాలు అమలు చేస్తారు. ప్రతి పట్టణంలో 500-600 మంది సీనియర్ సిటిజన్లను ఒక చోటికి చేర్చి, ఈ పథకం గురించి అవగాహన కల్పించాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు సూచించింది. వృద్ధులకు ఉండే హక్కులు, బాధ్యత, అవసరాలకు సంబంధించిన అంశాలపై శిక్షణ ఇస్తారు. వీరి కోసం పట్టణ స్థాయిలో భవన నిర్మాణం చేపట్టాలని కూడా నిర్ణయించారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు