Monday, December 15, 2014

అయ్యో ..చక్రి..

హైదరాబాద్‌,డిసెంబర్ 15; ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి(40) కన్నుమూశారు. సోమవారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో చక్రిని ఆయన కుటుంబసభ్యులు అపొలో ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స పొందుతూ చక్రి తుదిశ్వాస విడిచారు. చక్రి పూర్తిపేరు చక్రధర్‌ గిల్లా. ఆయన స్వస్థలం వరంగల్‌ జిల్లా మహబూబాబాద్‌. 85 సినిమాలకు సంగీతం అందించిన చక్రి సత్యం సినిమాకు ఉత్తమ గాయకుడిగా ఫిలింఫేర్‌ అవార్డు అందుకున్నారు. సింహా సినిమాకు నంది అవార్డు వరించింది. 1974 జూన్‌ 15న జన్మించిన చక్రి.. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన బాచి సినిమాతో సంగీత దర్శకుడిగా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆయన చివరి సినిమా దాసరి నటించిన 'ఎర్రబస్సు'. 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం', 'అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు..', 'అమ్మనాన్న ఓ తమిళ అమ్మాయి', 'ఇడియట్‌', 'దేశముదురు', 'సత్యం', 'గోపి గోపిక గోదావరి', 'సింహా'.. తదితర సినిమాలకు సంగీత దర్శకత్వం వహించి హిట్‌ పాటలను అందించారు. గాయకుడిగా కూడా చక్రి మంచి పేరును సంపాదించుకున్నారు. రీసెంట్‌గా తమన్, రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన పవర్‌ సినిమాలో కూడా  చక్రి ఓ హుషారైన పాటను పాడారు.


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...