Wednesday, December 24, 2014

58 కి పెరగనున్న ఎ.పి. ఎమ్మెల్సీల సంఖ్య...

హైదరాబాద్, డిసెంబర్ 24; ఆంధ్రప్రదేశ్  శాసనమండలి సభ్యుల సంఖ్య పెరగనుంది. విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుల సంఖ్య 50. అయితే వాస్తవానికి ఉండాల్సిన సభ్యుల సంఖ్య 58. అందువల్ల మండలి సభ్యుల సంఖ్యని 58కి పెంచుతామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ శాసనసమండలి సభ్యుల విషయంలో మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్ర శాసనమండలి సభ్యుల సంఖ్య విషయంలో కూడా విభజన చట్టంలో తప్పు వుంది. అలాగే రాజ్యసభ సభ్యుల కేటాయింపు విషయంలో కూడా పొరపాట్లు జరిగాయి. ఆంధ్రప్రదేశ్కి చెందిన కేవీపీ రామచంద్రరావును తెలంగాణకు కేటాయించారు. తెలంగాణకు చెందిన కె.కేశవరావును ఆంధ్రప్రదేశ్ కు  కేటాయించారు. అందువల్ల సదరు సభ్యులు తమ ఎంపీ నిధులను ఎక్కడ ఖర్చు చేయాలో అర్థంకాని పరిస్థితిలో వున్నారు. విభజన బిల్లులో జరిగిన ఇలాంటి అనేక పొరపాట్లను సరిచేయడానికి విభజన చట్టంలో మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. 


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...