Monday, December 1, 2014

తెలంగాణాలో మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ పథకం వచ్చే మార్చి 31 వరకు పొడిగింపు

హైదరాబాద్‌, డిసెంబర్‌ 1 : ప్రస్తుతం అమలులో ఉన్న ‘మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ స్కీము’ ను తెలంగాణ ప్రభుత్వం మరో నాలుగు నెలల పాటు పొడిగించింది. మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ పథకం వచ్చే మార్చి 31 వరకు కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.  ఈ రీయింబర్స్‌మెంట్‌ స్కీమును కొనసాగిస్తూనే.. దానికి సమాంతరంగా ఉద్యోగుల నగదు రహిత వైద్య చికిత్సల పథకం కూడా కొనసాగుతుందంటూ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అంటే హెల్త్‌ కార్డులు అందిన ఉద్యోగులు, పెన్షనర్లు.. నగదు రహిత వైద్య చికిత్సల పథకాన్ని కూడా వినియోగించుకోవచ్చు. కాగా ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల నగదు రహిత వైద్య చికిత్సల పథకం(ఈహెచ్‌ఎస్‌) కింద హృద్రోగుల సంబంధిత స్టెంట్ల ధరలను ప్రభుత్వం ఖరారు చేసింది. సాధారణంగా గుండె రక్త నాళాల్లో బ్లాక్‌లు ఏర్పడినప్పుడు రోగులకు వేసే స్టెంట్ల ధరలు బయటి మార్కెట్‌లో వాటి రకాలను బట్టి వేర్వేరుగా ఉన్నాయి. అందుకే సాధారణ ప్రజలకు సంబంధించిన ఆరోగ్యశ్రీ పథకం కింద ఈ స్టెంట్ల ధరల్లో మార్పులు చేస్తుంటారు. ఈసారి ఆరోగ్యశ్రీ ధరలతో పాటే ఉద్యోగుల ఆరోగ్య పథకం(ఈహెచ్‌ఎస్‌) కింద కూడా ధరలను ఖరారు చేశారు. రెండు స్కీముల కింద ఒకే రకమైన ధరలను నిర్ధారించారు. అంటే హృద్రోగులకు అందించే చికిత్సతో పాటు స్టెంట్ల ధరలను కలిపి ప్యాకేజీలను నిర్ణయించారు. ఇక మీదట ఒక రోగికి ‘పెర్కుటేనియస్‌ ట్రాన్‌స్లుమినల్‌ కరొనరీ యాంజియోప్లాస్టీ(పీటీసీఏ)’ ప్రొసీజర్‌ను నిర్వహించి, ‘బేర్‌ మెటల్‌ స్టెంట్‌’ను వేసినట్లయితే... రూ.55 వేల ప్యాకేజీని వర్తింపజేస్తారు. అదే రోగికి అదనంగా మరో బేర్‌ మెటల్‌ స్టెంట్‌ను వేయాల్సి వస్తే... దానికి రూ.10 వేల అదనపు చార్జీని చెల్లిస్తారు. లేదా... ఒక రోగికి పీటీసీఏ నిర్వహించి ‘డ్రగ్‌ ఎలూటింగ్‌ స్టెంట్‌ను వేసినట్లయితే... రూ.65 వేల ప్యాకేజీని వర్తింపజేస్తారు. 


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...