Monday, March 12, 2012

సుప్రీం నోటీసులపై శాసనసభలో గందరగోళం

హైదరాబాద్,మార్చి 12: జగన్ ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు ఆరుగురు రాష్ట్ర మంత్రులకు నోటీసులు జారీచేయడంపై శాసనసభలో గందరగోళం చెలరేగింది. ఆరుగురు మంత్రులు రాజీనామా చేయాలని టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. దీనిపై సభలో చర్చించాలని గట్టిగా పట్టుబట్టారు. దీనిపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పందిస్తూ మీడియాలో వచ్చిన అంశాలపై సభలో చర్చించడం సరికాదన్నారు. అసత్యాలను సభకు తీసుకొచ్చి చర్చించాలని కోరడం సబబు కాదన్నారు. కోర్టు ఏం చెప్పిందో తనకు తెలియదన్నారు. వాస్తవాలు తెలిశాక అన్ని అంశాలపై చర్చకు తాము సిద్ధమన్నారు. అధికార, ప్రతిపక్ష వాదోపవా దాలతో సభ దద్దరిల్లింది. దీంతో స్పీకర్ సభను  వాయిదా వేశారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...