Tuesday, March 6, 2012

బాధ్యత నాదే : రాహుల్

న్యూఢిల్లీ,మార్చి 6:  ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి తనదే బాధ్యతని కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీ అంగీకరించారు. ఈ ఎన్నికలు  తనకు మంచి పాఠాన్ని నేర్పాయని చెప్పారు.  యూపీలో ప్రజల మూడ్ సమాజ్‌వాదీ పార్టీ వైపు ఉందని, అక్కడ బలహీనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పునాదులను బలోపేతం చేసేవరకు పరిస్థితి మారదన్నారు. అయితే 2007తో పోలిస్తే ఇప్పుడు పరిస్థితి కొంత మెరుగైనట్టు కనిపిస్తోందన్నారు.  అక్కడ పార్టీ స్థితిగతుల్ని మెరుగుపర్చుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పారు. ఎన్నికల్లో పార్టీ వైఫల్యంపై విలేకరులు ప్రశ్నించగా.. ‘‘అవును. నేను ప్రచారం చేశాను. దీనికి బాధ్యత నేనే తీసుకుంటున్నా.. మేమందరం పార్టీ కోసం పోరాడాం. కానీ మంచి ఫలితాలు రాలేదు. ప్రచారంలో ప్రజలకిచ్చిన వాగ్దానాల మేరకు నేను ఇకపై కూడా గ్రామాల్లో, పొలాల్లో, పట్టణాల్లో కనిపిస్తాను. యూపీలో పార్టీని నిలబెట్టడానికి నా ప్రయత్నాల్ని సాగిస్తాను. నా పని నేను చేస్తూనే ఉంటాను’’ అని చెప్పారు. ‘‘ఇది నా ఓటముల్లో ఒకటి. దాన్ని నేను స్వీకరిస్తున్నాను. దారి పొడవునా విజయాలు ఉండాలని నేను ఆశిస్తాను. అలాగే ఓటములను కూడా..! వచ్చే ఫలితాలను స్వీకరిస్తాను’’ అని పేర్కొన్నారు. ప్రతి అంశాన్ని సునిశితంగా ఆలోచించే తనను, ఈ ఫలితాలు కూడా అదే తీరున ఆలోచింపచేస్తాయని భావిస్తున్నట్లు చెప్పారు. కాగా, యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పేలవ ప్రదర్శనపై కలత చెందిన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తానన్నారు. యూపీ ఫలితాలు తనను ఎంతగానో కలచివేశాయని, నిరుత్సాహపరిచాయని పేర్కొన్నారు. తప్పు చేశానన్న భావన వెంటాడుతోందన్నారు. కానీ తాను కాంగ్రెస్ నమ్మకమైన సిపాయినని...ఎన్నికల ఫలితాలకు పూర్తి బాధ్యత తీసుకుంటానన్నారు. ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ సృష్టించిన సానుకూల పవనాలను పేలవమైన రాష్ట్ర నాయకత్వం కారణంగా ఓట్లుగా మలుచుకోలేకపోయామని, న్నారు. ఇదే తమ అతిపెద్ద తప్పిదమని విశ్లేషించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...