Thursday, March 29, 2012

బామ్మర్ది కి మళ్ళి కోపమొచ్చింది...

హైదరాబాద్,మార్చి 29:   తెలుగుదేశం పార్టీ నాయకత్వంపై ఎన్టీఆర్ తనయుడు, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. నాయకత్వ లోపం వల్లే పార్టీకి సమస్యలు ఏర్పడ్డాయని ఆయన చంద్రబాబు ను పరోక్షంగా విమర్శించారు. కొంతమంది పార్టీ నాయకులతోనే టీడీపీ నాశనం అయిపోతోందని  ఆవేదన వ్యక్తం చేశారు. 30 ఏళ్లు బతికిన టీడీపీ... నాయకుల మూలాన నేడు ఈ స్థితికి వచ్చిందని ఆయన ఒక ఇంటర్వ్యూలోవిమర్శించారు. ప్రజలు, కార్యకర్తలే పార్టీని కాపాడుతూ వచ్చారన్నారు. టీడీపీ ఎన్టీఆర్ మానస పుత్రిక అని, తమకు తోబుట్టువు లాంటిదని అన్నారు. త్వరలోనే నందమూరి కుటుంబానికి మంచి రోజులు వస్తాయని, జూనియర్ ఎన్టీఆర్ కు రాజకీయ అనుభవం ఇంకా అవసరమన్నారు. టీడీపీ తమను బయటకు పంపించేవరకూ పార్టీకి సేవ చేస్తామన్నారు.టీడీపీలో కార్యకర్తల్ని నాయకులు విస్మరిస్తున్నారని, కార్యకర్తలు అధైర్యపడవద్దని, పనిచేయని నాయకత్వాన్ని నిలదీయాలని హరికృష్ణ పిలుపునిచ్చారు. ఓవైపు టీడీపీ 30వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతుండగానే... హరికృష్ణ ఈ వ్యాఖ్యలు చేయటం సంచలం సృష్టించింది. వ్యాపారాల కోసం తమ పార్టీ నాయకులు కాంగ్రెసుతో లాలూచీ పడుతున్నారని  దానివల్ల పార్టీ పరిస్థితి దిగజారిపోతోందని ఆయన అన్నారు. పార్టీ సరిగా అభివృద్ధి చెందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెసుతో తమ పార్టీ నాయకులు కమ్మక్కయ్యే వైఖరిని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...