Thursday, March 8, 2012

అసీస్ కే ముక్కోణపు సిరీస్‌

అడిలైడ్,మార్చి 8:  కామన్‌వెల్త్ బ్యాంక్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడవ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు పోరాడి ఓటమి పాలైంది. విజయానికి కావాల్సిన 232 లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్ చేపట్టిన లంక జట్టులో టాప్ ఆర్డర్  విఫలం కావడం తో   16 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ముక్కోణపు సిరీస్‌ను 3-2 తేడాతో ఆస్ట్రేలియా గెలుచుకుంది. టాస్ గెలిచి శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా జట్టును బౌలర్లు మహారూఫ్, హెరాత్ లు కట్టడి చేశారు. ఓ దశలో 177 పరుగులకే ఆస్ట్రేలియా జట్టు ఏడు వికెట్లు కోల్పోయింది. అయితే ఎనిమిదో వికెట్‌కు క్రిస్టియన్‌తో కలిసి బ్రెట్‌లీ 42 పరుగుల్ని జోడించడంతో ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక బౌలర్లలో మహారూఫ్, హెరాత్ మూడేసి వికెట్లు, కులశేఖర 2, దిల్షాన్ 1 వికెట్ పడగొట్టారు. ఆస్ట్రేలియా జట్టులో అత్యధికంగా వేడ్ 49, వార్నర్ 48, బ్రెట్‌లీ 32, మెక్‌కే 28 పరుగులు తప్ప మిగితా ఆటగాళ్ళెవరూ  రాణించలేదు.ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్రను పోషించి 5 వికెట్లు పడగొట్టిన మెక్ కే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...