అరసవల్లిలో అద్భుతం
శ్రీకాకుళం,అక్టోబర్ 1: శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యనారాయణస్వామి దేవాలయంలో అనివారం ఉదయం సూర్యకిరణాలు స్వామివారి మూలవిరాట్ ను తాకాయి. భానుని కిరణాలు స్వామివారి పాదాలపై పడటంతో ఈ అద్భుతాన్ని కనులారా వీక్షించిన భక్తులు పరవశించారు. అరుదుగా సంభవించే ఈ దృశ్యాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ప్రతి ఏడాది మార్చి, అక్టోబర్ నెలల్లో సూర్య కిరణాలు మూలవిరాట్ ను తాకుతాయి. అయితే ఈసారి మాత్రం రెండేళ్ల తర్వాత ఈ అద్భుతం చోటుచేసుకుంది.
Comments