Sunday, November 7, 2010

విద్యార్థులతో దీపావళి పండుగ జరుపుకున్న ఒబామా దంపతులు

ముంబై,నవంబర్ 7: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిషెల్లా భారత్ పర్యటనలో భాగంగా ముంబై హోలీనేమ్ పాఠశాల విద్యార్థులతో కలిసి దీపావళి పండుగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన నృత్యరీతికి ముగ్థులైన మిషెల్ ఒబామా లేచి వారితో కలిసి కదం కదిపారు. తన సతీమణి లయబద్ధంగా చేస్తున్న సంప్రదాయ నృత్యానికి పరవశించిన ఒబామా నవ్వుతూ, తాళం వేస్తూ ఐదు నిమిషాల పాటు విద్యార్థులతో కలిసి నృత్యం చేశారు. ఆ తరువాత తనను చుట్టుముట్టిన పిల్లలతో కరచాలనం చేస్తూ, ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు. ముంబయిలోని సెయింట్ జావియర్ కళాశాల విద్యార్థులతో ముచ్చటించిన ఒబామా ఓ ముస్లీం విద్యార్థి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ, ఉన్నతమైన ఇస్లాం మతాన్ని ఉగ్రవాదులు వక్రీకరిస్తున్నారని అన్నారు. తాము చేస్తున్న హింసాత్మక చర్యలను సమర్థించుకోవడానికి ఇస్లాంన్ని వాడుకుంటున్నారని అన్నారు. హింసాత్మక చర్యలు, వ్యక్తుల మధ్య విభేదాలు సృష్టించే వాటిని తిర స్కరించాలని ఆయన ప్రజలకు సూచించారు. మత వక్రీకరణలు చేస్తున్న వారిని ఏకాకులను చేయడమే ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లలో ఒకటని అన్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...