Sunday, November 14, 2010

హర్భజన్ హవా; భారత్ 436/9

హైదరాబాద్,నవంబర్ 14: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 9 వికెట్ల నష్టానికి 436 పరుగులు చేసింది. దీంతో కివీస్‌పై 86 పరుగులు ఆధిక్యం లభించింది. హర్భజన్ 85, శ్రీశాంత్ 14 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన హర్భజన్ చెలరేగి ఆడాడు. 42 బంతుల్లో 9వ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న భజ్జీ సెంచరీ దిశగా సాగుతున్నాడు. గంభీర్ 54, సెహ్వాగ్ 96, సచిన్ 13, ద్రావిడ్ 45, రైనా 20, ధోనీ 14, జహీర్‌ఖాన్ 7 పరుగులు చేసి అవుటయ్యారు. ఓజా డకౌట్ అయ్యాడు. కి వీస్ బౌలర్లలో వెటోరి 4, సౌతీ 2 వికెట్లు పడగొట్టారు. మార్టిన్ కు ఒక వికెట్ దక్కింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...