Tuesday, December 30, 2014

టెస్ట్‌ క్రికెట్‌కు ధోని గుడ్‌బై...

మెల్ బోర్న్, డిసెంబెర్ 30; భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆస్ట్రేలియాతో  టెస్ట్ సిరీస్ కోల్పోయిన తర్వాత ధోనీ ఈ ప్రకటన చేశారు. ధోనీ ఇంత త్వరగా టెస రిటైర్ అవుతాడని  ఎవరూ ఊహించలేదు. అలా ఎవరూ ఊహించని విషయాన్ని ప్రకటించి ధోనీ సంచలనం సృష్టించాడు. వచ్చే ప్రపంచ కప్ తర్వాత ధోనీ మొత్తం క్రికెట్ నుంచి తప్పుకునే అవకాశాలున్నాయన్న ఊహాగానాలున్నాయి. ధోనీ టెస్ట్ క్రికెట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవచ్చని మాజీ కెప్టెన్ గంగూలీ ప్రకటించాడు. అయితే మహేంద్ర సింగ్ ధోనీ మొత్తానికి టెస్ట్ క్రికెట్ నుంచే తప్పుకున్నాడు. వన్డేలు, టీ20లపై దృష్టి పెట్టేందుకే ధోని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 90 టెస్టులు ఆడిన ధోనీ 4,876 పరుగులు చేశారు. ఇందులో ఆరు సెంచరీలు, 33 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. 2005లో ధోని టెస్టులో అరంగేట్రం చేశారు. ధోని అత్యధిక వ్యక్తిగత స్కోరు 224 పరుగులు కాగా, టెస్టుల్లో 256 క్యాచ్‌లు, 38 స్టంపింగ్స్‌ చేశారు. దాదాపు 60 టెస్టుల్లో ధోనీ భారత్‌కు కెప్టెన్సీగా వ్యవహరించారు. ధోనీ కెప్టెన్సీలో భారత్‌కు 27 టెస్ట్‌ విజయాలు వరించాయి. ధోని కెప్టెన్సీలో టెస్టుల్లో భారత్‌ వరల్డ్‌ నెం.1గా నిలిచింది. ఆసీస్‌తో టెస్ట్‌ సిరీస్‌ ఓటమి తర్వాత ధోని అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. టెస్టులకు దోని రిటైర్డ్‌ ప్రకటించడంతో ఆసిస్‌తో చివరి టెస్టుకు కోహ్లీ కెప్టెన్సీగా వ్యవహరించనున్నారు. 


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...