Thursday, March 8, 2012

నటి రాధాకుమారి మృతి

హైదరాబాద్,మార్చి 8:   ప్రముఖ నటుడు రావి కొండలరావు సతీమణి, నటి రాధాకుమారి (70) అనారోగ్యంతో  కన్నుమూశారు. నాటక రంగంనుండి చిత్రసీమలోకి అడుగుపెట్టిన రాధాకుమారి తనదైనా సంభాషణా చాతుర్యంతో పలుచిత్రాలలో అమ్మగా అమ్మమ్మగా నటించి మెప్పించారు.నాలుగు దశాబ్దాలుగా తెలుగులో అనేక చిత్రాల్లో నటించారు. రాధాకుమారి ,రావికొండల రావులు వెండితెరపై కూడా భార్యాభర్తలుగా నటించారు. రాధాకుమారి సుమారు 600 చిత్రాల్లో నటించారు. ఆమె మృతి పట్ల తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర సంతాపం తెలిపింది. చందమామ, ఇట్లు మీ శ్రేయోభిలాషి, నువ్వు లేక నేను లేను , బృందావనం తదితర సినిమాల్లో రాధాకుమారి అద్భుత నటన కనబర్చారు.
 మొదటిసారిగా ఆదుర్తి సుబ్బారావు  దర్శకత్వంలో అందరూ నూతన తారలతో తయారైన తేనె మనసులు (1965) సినిమాలో నటించింది. ఈ చిత్రంలో 20 ఏళ్ళ వయసులో హీరో కృష్ణకు సవతి తల్లిగా నటించి మెప్పించింది.
కొంతకాలం విరామం తర్వాత  తిరిగి   నువ్వులేక నేనులేను తో సినిమాలలో నటించడం ప్రారంభించారు.
 బుల్లితెర సీరియల్ రాధ-మధు లో ప్రముఖ పాత్ర పోషించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...