Posts

Showing posts from October, 2012

జగన్ రిమాండ్‌ నవంబర్ 8 వరకు పొడిగింపు

హైదరాబాద్, అక్టోబర్ 25:  అక్రమాస్తుల వ్యవహారంలో వైఎస్ జగన్ రిమాండ్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు నవంబర్ 8 వరకు పొడిగించింది. ఇదే కేసులో నిందితులు మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, వాన్‌పిక్ సంస్థల అధినేత నిమ్మగడ్డ ప్రసాద్, ఐఆర్‌ఏఎస్ అధికారి బ్రహ్మానందరెడ్డిల రిమాండ్‌ను కూడా వచ్చేనెల 8 వరకు పొడిగించింది. రిమాండ్ ముగియడంతో గురువారం వీరిని చంచల్‌గూడ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు ఎదుట హాజరుపరిచారు.

ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్లర్ ఫైనల్‌కు సైనా

పారిస్, అక్టోబర్  25:  వైల్డ్ కార్డు ఎంట్రీ సాధించిన సైనా ఫ్రెంచ్ ఓపెన్‌లో తన జోరు కొనసాగిస్తోంది.  రెండో రౌండ్‌లో థాయిలాండ్ క్రీడాకారిణి సప్పిరి పై 21-16, 21-13 తేడాతో సైనా విజయం సాధించి క్వార్లర్ ఫైనల్‌కు చేరుకుంది.  ఒలింపిక్ విజయం తర్వాత ఆడిన తొలి టోర్నీ డెన్మా ర్క్ ఓపెన్‌ లోనే చాంపియన్‌గా నిలిచి దూకుడు మీద ఉన్న  సైనా నెహ్వాల్ ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్‌ను కూడా నెగ్గి ఈ ఏడాది ఐ దో టైటిల్ ఖాతాలో వేసుకోవాలని తహతహలాడుతోంది. 

వార్తాప్రపంచం వీక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు...

Image

'దీపం' లబ్దిదార్లకు అదనపు సిలిండర్లు

హైదరాబాద్ , అక్టోబర్ 23:   ప్రజలకు  ప్రస్తుతం ఇస్తున్న ఆరు గ్యాస్ సిలిండర్లకు తోడుగా రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు సిలెండర్లను సబ్సిడీపై అందించేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అయితే దీపం పథకం కింద కనెక్షన్లు ఉన్నవారికే ఈ అదనపు  మూడు సిలిండర్లు లభిస్తాయని పౌర సరఫరాల మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. తెల్లరేషన్‌ కార్డు ఉన్నా సబ్సిడీతో అదనపు సిలిండర్లు ఇవ్వలేమని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.

ఎడ్యూరప్ప సొంత కుంపటి...

బెంగళూరు , అక్టోబర్ 23:   కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ ఎడ్యూరప్ప బీజేపీ నుంచి వైదొలగాలని  నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 10 తేదిన ప్రాంతీయ పార్టీని ప్రారంభించేందుకు సన్నాహాలు ప్రారంభించారు. ముఖ్యమంత్రి జగదీష్ షెట్టార్ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వ మనగడపై అనుమానాలు వ్యక్తం చేశారు. 'బీజేపీ, శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి.. డిసెంబర్ 10 తేదిన ప్రాంతీయ పార్టీని ప్రారంభిస్తున్నట్టు  యోడ్యురప్ప చెప్పారు. 

ఉరికి చేరువలో కసబ్...

Image
న్యూఢిల్లీ, అక్టోబర్ 23:  ముంబై కాల్పుల ఘటనలో ఉరిశిక్ష పడిన ఉగ్రవాది అజ్మల్ కసబ్ పెట్టుకున్న  క్షమాభిక్ష పిటిషన్‌ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మంగళవారం తోసిపుచ్చింది. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రపతి భవన్‌కు సమాచారం అందించింది. కసబ్ మెర్సీ పిటిషన్‌ను తోసిపుచ్చాలని హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రపతిని కోరింది. తనకు క్షమాభిక్ష ప్రసాదించి, ఉరిశిక్షను జీవితఖైదుగా మార్చాలని కసబ్ రాష్ట్రపతికి పిటిషన్ పెట్టుకున్నాడు. దీనిపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. కసబ్ క్షమాభిక్ష పిటిషన్‌ను తోసిపుచ్చాలని ఇంతకు ముందు మహారాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ కూడా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరింది.

తెలంగాణలో మొదలైన చంద్రబాబు పాదయాత్ర...

హైదరాబాద్, అక్టోబర్ 22: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేపట్టిన  వస్తున్నా... మీకోసం పాదయాత్ర సోమవారం తెలంగాణలోకి అడుగుపెట్టింది.  జిల్లాలోని రాజోలీలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తమ పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. తమ పార్టీ పాలనలోనే తెలంగాణలో అభివృద్ధి జరిగిందని, ఈ విషయంపై తాము ఎవరితోనైనా చర్చకు సిద్ధమని అన్నారు. తెలంగాణలో పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసింది తమ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావేనని చంద్రబాబు చెప్పారు. తెలంగాణకు కేంద్రమే పరిష్కారం చూపాలని ఆయన అన్నారు.  సామాజిక న్యాయానికి తాను కట్టుబడి ఉన్నానని, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణలో మాదిగలకు అండగా ఉంటానని చెప్పారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే తొలి సంతకం రుణమాఫీ, మలి సంతకం మద్యం గొలుసు దుకాణాల రద్దు ఫైళ్ల మీదనే అని చెప్పారు. సబ్సిడీపై 10 వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చారు. పార్టీ కార్యకర్తలు తనకు ప్రాణంతో సమానమని చెపూకొచ్చారు.

నామినేటెడ్ పోస్టుల భర్తీకి శ్రీకారం : రాజ్యలక్ష్మి, మండలి బుద్ధ ప్రసాద్ లకు పదవులు

హైదరాబాద్, అక్టోబర్ 22:  ఎట్టకేలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నామినేటెడ్ పోస్టుల భర్తీకి  శ్రీకారం చుట్టారు. తొలి విడతగా ఇద్దరు మాజీ మంత్రులకు పదవులు దక్కాయి. మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేదురుమల్లి రాజ్యలక్ష్మి, అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా మండలి బుద్ధప్రసాద్ నియమితులయ్యారు. రాజ్యలక్ష్మి, మండలి బుద్ధ ప్రసాద్ 2009 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వీరిలో రాజ్యలక్ష్మి నెల్లూరు జిల్లాకు చెందినవారు కాగా, మండలి బుద్ధప్రసాద్ కృష్ణా జిల్లాకు చెందినవారు. రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ వరుసగా 2004, 2009 ఎన్నికల్లో గెలిచినప్పటికీ నామినేటెడ్ పోస్టుల భర్తీ జరగలేదు. 2004 ఎన్నికలలో  కాంగ్రెసు విజయంతో వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కొద్ది మందిని మాత్రమే నామినేటెడ్ పోస్టులు వరించాయి. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా రోశయ్య కూడా నామమాత్రంగానే పోస్టులను భర్తీ చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా కాలం నుంచి నామినేటెడ్ పోస్టుల భర్తీకి ప్రయత్నాలు సాగించారు. నామినెటెడ్ పోస్టుల భర్తీని విడతలవారీగా చేపట్టాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు సమాచారం....

విజయమ్మ ' బైబిల్ ' వివాదం...

Image
 హైదరాబాద్ , అక్టోబర్ 21:   వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ రాజకీయ పార్టీ సభలకు, సమావేశాలకు, యాత్రలకు బైబిల్ చేత పట్టుకొని వెళ్లడం వివాదాస్పదమవుతోంది. విజయమ్మ రాజకీయ లబ్ధి కోసం బైబిల్ చేత పట్టుకొని వెళ్తున్నారని తెలుగుదేశం పార్టీ మొదటి నుండి విమర్శలు చేస్తోంది. తాజాగా, జగన్ సోదరి షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో విజయమ్మ బైబిల్ చేబూనటం వివాదస్పదమైంది. రాజకీయ కార్యక్రమాలకు  ఆమె బైబిల్‌ను తీసుకు రావడం ఒకరకంగా తెలుగుదేశం శ్రేణులు  ఆరోపిస్తున్నాయి. బైబిల్ చేతపట్టుకొని రాజకీయ యాత్రలకు రావడం ద్వారా విజయమ్మ ఒక  వర్గాన్ని తమ వైపుకు రప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని  వారు విమర్శిస్తున్నారు. అయితే విజయమ్మ మాత్రం బైబిల్ రాజకీయాలను ఖండించారు. తాను ఎక్కడా మత ప్రచారం చేయలేదని, తనకు మత ప్రచారం చేయాల్సిన అవసరం కూడా లేదని ఆమె మీడియా సమావేశంలో అన్నారు. తాను ఎక్కడకు వెళ్లినా బైబిల్‌ను తీసుకు వెళ్తానని, బైబిల్ చేతిలో ఉంటే ధైర్యంగా ఉంటుందన్నారు. అంత మాత్రాన తాను మత ప్రచారం చేసినట్లు కాదని ఆమె చెప్పా...

యష్ చోప్రా నో మోర్...

Image
ముంబై, అక్టోబర్ 21:  ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత యష్ చోప్రా ఆదివారం సాయంత్రం ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన కొద్ది రోజుల నుంచి డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్నారు. షారుఖ్ ఖాన్ తో తీసిన జబ్ తక్ హై జాన్ ఆయన చివరి చిత్రం.  సెప్టెంబర్ 27న  యష్ చోప్రా తన 71వ జన్మదినోత్సవాన్ని జరుపుకున్నారు. గతంలో ఆయన  'షోలే- ద మేకింగ్ ఆఫ్ ఎ క్లాసిక్' పుస్తకం  జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకొని, పదివేల కాపీలు అమ్ముడయింది. యష్ చోప్రా దర్శకత్వం వహించిన 'దూల్ కా ఫూల్', వక్త్, డాగ్, దీవార్, కభీ కభీ, సిల్ సిలా, చాందిని, డర్, దిల్ తో పాగల్ హై, వీర్ జరా చిత్రాలు విశేష ప్రజాదరణ పొందాయి. 

కింగ్‌ఫిషర్ లెసైన్స్ నిలుపుదల

న్యూఢిల్లీ, అక్టోబర్ 20: తీవ్ర రుణ సంక్షోభంలో చిక్కుకున్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కు తాజాగా పౌరవిమానయాన డెరైక్టరేట్ జనరల్ (డీజీసీఏ) షాకిచ్చింది. లెసైన్స్ (షెడ్యూల్డ్ ఆపరేటర్ పర్మిట్-ఎస్‌వోపీ) ను నిలుపుదలచేస్తూ (సస్పెన్షన్) శనివారం ఉత్తర్వులిచ్చింది. తిరిగి ఆదేశాలు జారీ దీనితో చేసేవరకూ సస్పెన్షన్ అమలులో ఉంటుందని పౌరవిమానయాన శాఖ అధికారులు పేర్కొన్నారు. వెరసి తొమ్మిదేళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కింగ్‌ఫిషర్... తొలిసారి విమాన సర్వీసులను పూర్తిగా రద్దు చేసుకోవాల్సిన పరిస్థితిలో పడింది. మూడు వారాలుగా లాకౌట్‌లో కొనసాగుతున్న కంపెనీ ఇటు ఆర్థికంగానూ, అటు నిర్వహణపరంగానూ ఎలాంటి ఆచరణీయ ప్రణాళికనూ సిద్ధం చేయలేకపోవడంతో డీజీసీఏ ఈ చర్యలు చేపట్టింది. లెసైన్స్ సస్పెన్షన్‌తో కింగ్‌ఫిషర్ నెట్‌వర్క్ తోపాటు, ట్రావెల్ ఏజెంట్ల ద్వారా జరిగే అన్ని రకాల బుకింగ్‌లూ నిలిచిపోనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. కాగా, భద్రతా చర్యలలో భాగంగా డీజీసీఏ కింగ్‌ఫిషర్ లెసైన్స్ ను నిలుపుదల చేసిందని పౌర విమానయాన మంత్రి అజిత్ సింగ్ చెప్పారు. ఇంజనీర్లు సమ్మెలో ఉన్నందున విమానాల నిర్వహణ, తత్సంబంధిత సేవలను చేపట్టడంలేదని తెల...

డెన్మార్క్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో సైనా

ఒడెన్స్ ,అక్టోబర్ 18:  డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ మహిళల సింగిల్స్ లో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 28వ ర్యాంకర్ మితాని మినత్సు (జపాన్) పై 21-15, 21-14 తో సైనా గెలిచింది.

పవర్ కోసం వీధిన పడ్డ వై.ఎస్. ఇంటి పడుచులు !

Image
కడప,అక్టోబర్ 18:  వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల గురువారం మధ్యాహ్నం తన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రను ప్రారంభించారు.  వైయస్సార్ ఘాట్ నుండి ప్రారంభమైన షర్మిల యాత్రలో తొలి రోజున జగన్ సతీమణి భారతి రెడ్డి, తల్లి విజయమ్మ పాల్గొన్నారు. షర్మిల సాయంత్రం ఐదు గంటల వరకు ఆరు కిలోమీటర్లు నడిచారు. ట్రిపుల్ ఐటి, వీరగట్టుపల్లె, కుమ్మరాంపల్లె మీదుగా ఆమె యాత్ర కొనసాగింది.  పార్టీ నేతలు శోభా నాగి రెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి, వాసిరెడ్డి పద్మ, రోజా తదితరులు కూడా షర్మిల వెంటఉన్నారు. నల్లబ్యాడ్జీలు ధరించి వారు పాదయాత్ర చేపట్టారు.  పాదయాత్ర ప్రారంభానికి ముందు ఇడుపులపాయలో విజయమ్మ, షర్మిల భారీ బహిరంగ సభలో మాట్లాడారు. టిడిపి, కాంగ్రెసు కుమ్మక్కై జగన్‌ను జైలుకు పంపించారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు తమ వెంటే ఉన్నారన్నారు. షర్మిల తనను  దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి కూతురుగా, జగన్ సోదరిగా పరిచయం చేసుకున్నారు. తన అన్న తరఫున తాను పాదయత్ర చేస్తున్నట్లు షర్మిల చెప్పారు. రాజన్న కూతురిగా..... జగనన్న చెల్లెలిగా... వైఎస్ఆర్ కా...

గడ్కరీ పరమ అవినీతిపరుడు..చిట్టా విప్పిన కేజ్రీవాల్

Image
న్యూఢిల్లీ, అక్టోబర్ 17: : అవినీతి వ్యతిరేక ఉద్యమం చేస్తున్న అరవింద్ కేజ్రీవాల్ బుధవారం భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ అవినీతి చిట్టా విప్పారు.  కేంద్రమంత్రి సల్మాన్ ఖుర్షీద్‌ను తొలి విడతగా టార్గెట్ చేసిన కేజ్రీవాల్ ఈసారి గడ్కరీ అవినీతి ని బయటపెట్టారు. గడ్కరీని  రాజకీయ నాయకుడు అనడం కంటే మంచి వ్యాపారవేత్త అనడం సబబు అన్నారు. మహారాష్ట్రలో గడ్కరీకి పెద్ద వ్యాపార సామ్రాజ్యం ఉందని ఆరోపించారు. మహారాష్ట్ర నీటిపారుదల కుంభకోణంలో గడ్కరీ పాత్ర కూడా ఉందని ఆరోపించారు. శరద్ పవార్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని గడ్కరీయే చెప్పారన్నారు. గతంలో ప్రాజెక్టు కోసమని సేకరించిన భూమిలో చాలా మిగిలి పోయిందని, మిగిలిన ఆ భూమిని తనకు అప్పగించాలని రైతులు 2002లో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారని, అయితే ప్రభుత్వం మాత్రం వారి విజ్ఞప్తులను పట్టించుకోలేదన్నారు. 2005లో గడ్కరీ ఆ భూములను తనకు ఇవ్వాల్సిందిగా లేఖ రాస్తే విలాస్ రావు దేశ్ ముఖ్ ప్రభుత్వం కట్టబెట్టిందన్నారు. నాగపూర్ రైతుల భూములను గడ్కరీకి ప్రభుత్వం ధారాదత్తం చేసిందన్నారు. రైతుల ప్రాణాలు ఫణంగా పెట్టి గడ్కరీ మహా ప్రభుత్వం నుండి ప్రయోజనం ...

సచిన్‌కు ఆర్డర్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియాలో సభ్యత్వం

న్యూఢిల్లీ, అక్టోబర్ 16  మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం సచిన్ కు ఆర్డర్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియా లో సభ్యత్వాన్ని కల్పించింది. దీనికి సంబంధించి ఆ దేశ ప్రధాని జూలియా గిల్లార్డ్  ప్రకటన చేశారు.  త్వరలో భారత్‌లో పర్యటించనున్న ఆస్ట్రేలియా క్యాబినెట్‌ మినిస్టర్‌ సైమన్‌ క్రీన్‌ ఈ గౌరవాన్ని ప్రదానం చేస్తారు. అసాధారణ సేవలందించిన ప్రముఖులను లేదా ఆస్ట్రేలియా పౌరులను ఈ గౌరవంతో సత్కరిస్తారు. ఆరు గ్రేడ్లు ఉన్న ఆర్డర్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియాలో సచిన్‌ను సభ్యత్వంతో గౌరవించనున్నారు. గతంలో ఈ గౌరవాన్ని అందుకున్న క్రికెటర్లలో బ్రియాన్‌ లారా ఉన్నారు. వెస్టిండీస్‌కు చెందిన క్లైవ్‌ లాయిడ్‌ ఆర్డర్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియాలో ఆఫీసర్‌గా గౌరవం పొందారు.

తెలంగాణ ఒక్కటే సమస్యా ? వాయలార్

న్యూఢిల్లీ, అక్టోబర్ 16 : దేశంలో తెలంగాణ ఒక్కటే సమస్య కాదని ఇంకా చాలా సమస్యలు ఉన్నాయని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, కేంద్రమంత్రి వాయలార్ రవి మంగళవారం అన్నారు.  తెలంగాణపై చర్చల ప్రక్రియ ఆగిపోలేదని,  అందరితోనూ చర్చిస్తున్నామని,   అయితే చర్చలు ఎప్పటిలోగా ముగుస్తాయో ఖచ్చితంగా చెప్పలేమని అన్నారు.  కేంద్రం, కాంగ్రెసు పార్టీ కూడా సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలనే  ఉద్దేశం తో  ఉన్నాయని  చెప్పారు. 

జీవ వైవిధ్య పరిరక్షణకు 50 మిలియన్ డాలర్లు: ప్రధాని

Image
హైదరాబాద్, అక్టోబర్ 16: జీవ వైవిధ్య సదస్సుకు నాయకత్వం వహించే రెండేళ్ళ కాలం లో భారత్  ఇందుకు సంభందించిన ప్రాజెక్ట్ పై 50 మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తుందని  ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్  చెప్పారు.  జీవ వైవిధ్య పరిరక్షణకు సంస్థాగత వ్యవస్థ పటిష్టతపై ఈ నిధులు వెచ్చిస్తామన్నారు. హైదరాబాదులో జరుగుతున్న జీవ వైవిధ్య సదస్సులో మంగళవారం నాడు ప్రధాని పాల్గొన్నారు. జీవ వైవిధ్య ప్రాధాన్యత భారతీయ సంస్కృతిలో అంతర్భాగమని  మన్మోహన్ సింగ్  అన్నారు.  జీవ వైవిధ్య ప్రాధాన్యతను ప్రపంచ దేశాలు కూడా  గుర్తిస్తున్నాయని చెప్పారు. పర్యావరణ ఇబ్బందులపై ప్రజల్లో అవగాహన క్రమంగా ఏర్పడుతోందన్నారు.  జీవ వైవిధ్యం పై 2010 లక్ష్యాలను చేరుకోలేక పోయామని,  ప్రకృతి నుండి కనుమరుగు అవుతున్న జంతువులను పరిరక్షించాల్సిన బాధ్యత మనపై ఉందని ప్రధాని అన్నారు. గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే పర్యావరణమే ముఖ్యమన్నారు. ఆయుర్వేద విజ్ఞానాన్ని పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు వాడుతున్న విత్తనాల పేటెంట్ హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. భారత దేశంలో 600 పర్యావరణ పరిరక్షణ...

షిర్డీ సాయి కానుకల వేలం

షిర్డీ, అక్టోబర్ 14: షిర్డీ సాయిబాబా ఆలయానికి భక్తులు సమర్పించిన విలువైన కానుకలను  ఈ నెల 18 నుంచి వేలం వేయనున్నట్టు  శ్రీసాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ తెలిపింది. వీటిలో వెండి, బంగారు, రత్నాలు, వజ్రాలు, ఖరీదైన రాళ్లతో తయారైన కిరీటాలు, హారాలు, పాదుకలు తదితర వస్తువులున్నాయి. మొత్తం 32 కేజీల వెండి, 18 కేజీల బంగారు కానుకలు, 52 విలువైన రత్నాలు, వజ్రాలను వేలం వేయనున్నట్లు  ట్రస్ట్ ప్రతినిధి తెలిపారు. 18న వెండి, వచ్చే నెల 1న బంగారు, 8న విలువైన రాళ్లను వేలం వేస్తామన్నారు. ఇందులో పాల్గొనే వారు రూ.10 వేల రీఫండబుల్ డిపాజిట్‌ను చెల్లించాల్సి ఉంటుంది .  సాయి కి వచ్చిన కానుకలను కొనుక్కోవడానికి భక్తులు మొగ్గచూపడంతో వాటిని  కరిగించకుండా వేలం వేస్తున్నారు.

లోక్‌సభ ఉపఎన్నికలో ప్రణబ్ తనయుని గెలుపు

Image
కోల్ కతా, అక్టోబర్ 13:  పశ్చిమ బెంగాల్ లోని జంగీపూర్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తనయుడు అభిజిత్ ముఖర్జీ స్వల్ప మైజార్టీతో గెలుపొందారు. సమీప సీపీఎం అభ్యర్థి ముజాఫర్ హుస్సేన్ పై 2,536 ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు. అభిజిత్ కు 3,32,919 ఓట్లు రాగా, హుస్సేన్ కు 3,30,383 ఓట్లు వచ్చాయి. 2009లో ఇక్కడ నుంచి పోటీ చేసిన ప్రణబ్ ముఖర్జీ 1.28 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.

2011 నంది అవార్డులు : ఉత్తమ నటుడు మహేష్ బాబు...ఉత్తమ నటి నయనతార

Image
హైదరాబాద్, అక్టోబర్ 13:  రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా అందించే నంది అవార్డులను శనివారం ప్రకటించారు. 2011 సంవత్సరానికి గాను ఉత్తమ నటుడిగా మహేష్ బాబు(దూకుడు) ఎంపిక కాగా, ఉత్తమ నటిగా నయనతార (శ్రీరామ రాజ్యం), ఉత్తమ చిత్రంగా శ్రీరామ రాజ్యం ఎంపికయింది. ఉత్తమ దర్శకుడిగా ఎన్ శంకర్ (జైబోలో తెలంగాణ) ఎంపికయ్యారు. ఇతర అవార్డుల వివరాలు:  ఉత్తమ విలన్ : మంచు లక్ష్మి (అనగనగా ఒక ధీరుడు), ఉత్తమ ద్వితీయ చిత్రం : రాజన్న, ఉత్తమ తృతీయ చిత్రం : విరోధి, ఉత్తమ గాయకుడు : గద్దర్ (జై బోలో తెలగాణ చిత్రంలోని పొడుస్తున్న పొద్దుమీద ), ఉత్తమ గాయని: మాళవిక (రాజన్న), ఉత్తమ సంగీత దర్శకుడు : ఇళయరాజా (శ్రీరామ రాజ్యం),   ఉత్తమ కుటుంబ కథాచిత్రం : 100% లవ్, ఉత్తమ హాస్య నటుడు : ఎంఎస్ నారాయణ(దూకుడు), ఉత్తమ సహాయ నటుడు : ప్రకాష్ రాజ్ (దూకుడు), ఉత్తమ పిల్లల చిత్రం : శిఖరం, ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం : అవయవదానం, ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ : సమ్మెట గాంధీ(రాజన్న), ఉత్తమ సహాయనటి : రత్నసాగరి(కారాలు మిర్యాలు), ఉత్తమ బాల నటుడు : నికిల్ (100% లవ్), ఉత్తమ బాల నటి : బేబి ఆని(రాజన్న), ఉత్తమ మాటల రచయిత : న...

ఐపీఎల్‌లో స్థానం కోల్పోయిన డెక్కన్ చార్జర్స్

ముంబయి,అక్టోబర్ 12: ఐపీఎల్‌ లో డెక్కన్ చార్జర్స్ స్థానం కోల్పోయింది. ముంబయి హైకోర్టు ముందు రు. 100 కోట్లు బ్యాంకు గ్యారంటీని గడువులోగా చెల్లించనందున డెక్కన్ చార్జర్స్ ఐపీఎల్ కాంట్రాక్ట్ ను  రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. గతంలో డెక్కన్ చార్జర్స్ కాంట్రాక్టును రద్దు చేస్తూ బీసీసీఐ ప్రకటించడంతో ప్రాంచైజీ యాజమాన్యం డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తమకు అక్టోబర్ 15 వరకూ గడువు కావాలని డెక్కన్ ప్రాంచైజీ కోరడంతో న్యాయస్థానం తిరస్కరించింది. న్యాయస్థానం ఇచ్చిన గడువులోగా డెక్కన్ డెక్కన్ చార్జర్స్ బ్యాంకు గ్యారంటీని చెల్లించకపోవడంతో తదుపరి ఐపీఎల్‌లో స్థానం కోల్పోయింది.

తెలంగాణపై షిండే మాటకే అజాద్ ఓటు...

హైదరాబాద్, అక్టోబర్ 12:  తెలంగాణపై నిర్ణయం తీసుకోవడం అంత సులభమైన విషయం కాదని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ వచ్చిన ఆయన గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెసు కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.  తెలంగాణ చాలా జఠిలమైన అంశమని  ఆయన అన్నారు. తాము తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతోనే గాక, అందరితోనూ చర్చలు జరుపుతున్నామని ఆయన చెప్పారు. ఢిల్లీకి ఎవరు వచ్చినా మాట్లాడుతామని ఆయన అన్నారు. మంత్రులు, శానససభ్యులతో మాట్లాడుతున్నామని ఆయన అన్నారు. ఇప్పటి వరకు తెలంగాణపై తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. తెలంగాణపై రెండేళ్ల నుంచి చర్చలు జరుపుతున్నామని , ఏకాభిప్రాయ సాధన  వరకు నిర్ణయం సాధ్యం కాదని ఆయన అన్నారు. ఎవరికి వారు వాదనలు వినిపిస్తున్నారు గానీ ఏకాభిప్రాయం రావడం లేదని ఆయన అన్నారు.ఎంపి, బీహార్, యుపి విభజన మాదిరిగా తెలంగాణపై నిర్ణయం తీసుకోవడానికి వీలు కాదని అన్నారు. కాగా, తెలంగాణపై అభిప్రాయ సేకరణ కొనసాగుతోందని, ఈ సమస్యపై పరిష్కారం ఎప్పుడు వస్తుందో ఇప్పుడే చెప్పడం కష్టమని కేంద్ర హోం మంత్రి షిండే రెండు రోజుల క్...

మూడు రోజుల్లోనే తత్కాల్ పాస్‌పోర్టులు

హైదరాబాద్, అక్టోబర్ 11:  రాష్ట్రంలో మరో రెండు మినీ పాస్‌పోర్టు సేవా కేంద్రాలను నెలకొల్పనున్నట్టు సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి డాక్టర్ శ్రీకర్‌రెడ్డి వెల్లడించారు. కరీంనగర్, భీమవరంలలో 4 నెలల్లోనే వీటిని అందుబాటులోకి తెస్తామన్నారు. ఆధార్‌కార్డు అమలులోకి వస్తే పాస్‌పోర్టు జారీ ప్రక్రియ మరింత సులభతరమవుతుందని చెప్పారు. స్థానిక పోలీసు విచారణలో జాప్యం కారణంగానే పాస్‌పోర్టు జారీ ఆలస్యమవుతోందని తెలిపారు. తత్కాల్ కింద కేవలం మూడు రోజుల్లోనే పాస్‌పోర్టు జారీ చేస్తున్నట్టు ఆయన చెప్పారు. పాస్‌పోర్టు కోసం ఏజెన్సీలను సంప్రదించి మోసపోవద్దని దరఖాస్తుదారులకు శ్రీకర్‌రెడ్డి సూచించారు. ఏజెన్సీలు నకిలీ పత్రాలు సృష్టించి, ఫోర్జరీ సంతకాలు చేసి పాస్‌పోర్టులు అందజేస్తున్నాయని, ఈ విషయం విచారణలో బయటపడితే దరఖాస్తుదారులే ఇబ్బంది పడతారని హెచ్చరించారు.
Image
70వ బర్త్ డే సందర్భంగా కుటుంబ సభ్యులతో అమితాబ్...  

'తెహల్కా' బంగారు కు బెయిల్...

న్యూఢిల్లీ, అక్టోబర్ 11: తెహల్కా కేసులో నిందితుడైన భారతీయ జనతా పార్టీ జాతీయ మాజీ అధ్యక్షుడు, దళిత నేత బంగారు లక్ష్మణ్‌ కు ఢిల్లీ హైకోర్టు ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేసింది.  ఆయనకు రూ.50వేల పూచికత్తుతో న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. ఆయుధ డీలర్ల నుంచి లక్ష రూపాయిలు లంచం తీసుకుంటూ తెహల్కా డాట్ కామ్ చేసిన స్టింగ్ ఆపరేషన్ లో బంగారు లక్ష్మణ్ పట్టుబడిన సంగతి తెలిసిందే. గత ఏప్రిల్ నుంచి బంగారు లక్ష్మణ్ జైలులో ఉన్నారు.

వై.ఎస్. ఫ్యామిలీ మరో ప్రజా ప్రస్థానం...18 నుంచి షర్మిల పాదయాత్ర...

Image
హైదరాబాద్, అక్టోబర్ 11: : రాష్ట్రంలో ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు తన కూతురు  షర్మిల పాదయాత్ర చేస్తుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ తెలిపారు. షర్మిల పాదయాత్రను ప్రారంభిస్తుందని, తరువాత జగన్ బెయల్ పై విడుదలయి వస్తే ఆయన పాదయాత్రను కొనసాగిస్తారని  విజయమ్మ చెప్పారు. ఈ పాదయాత్రను జగన్ చేపట్టాలనుకున్నారని కానీ, ఆయన జైలుకు వెళ్లడంతో షర్మిల చేపట్టేందుకు సిద్ధపడిందని చెప్పారు. తన ఆరోగ్యం దృష్ట్యా తనను వద్దని పార్టీలోని పెద్దలు సూచించారన్నారు. జగన్ స్థానంలో ఎవరో ఒకరు పాదయాత్ర చేయాలని చర్చించుకుంటున్న సమయంలో షర్మిల అందుకు సిద్ధపడ్డారన్నారు. పాదయాత్ర మధ్యలో తాను, జగన్ సతీమణి భారతి రెడ్డి అప్పుడప్పుడు పాలు పంచుకుంటామన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తితో ప్రజల్లోకి వెళుతున్నామని చెప్పారు. అందుకే ఆయన ప్రజా ప్రస్థానం పేరుతో యాత్ర చేస్తే షర్మిల మరో ప్రజా ప్రస్థానం పేరుతో యాత్ర చేస్తారన్నారు.  తెలంగాణ జిల్లాల్లో కూడా యాత్ర ఉంటుందని చెప్పారు. చంద్రబాబు యాత్రకు తమ యాత్రకు తేడా ఉంటుందన్నారు. ఆయనపై ప్రజలకు విశ్వాసం లేదని, కా...

తెలంగాణ పరిష్కారం ఎప్పుడో చెప్పలేం : షిండే

న్యూఢిల్లీ, అక్టోబర్ 10: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో తాము తెలంగాణ అంశంపై చర్చించ లేదని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే  స్పష్టం చేశారు.  తెలంగాణపై ఇప్పట్లో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయబోమని షిండే స్పష్టం చేశారు. కెసిఆర్‌తో తెలంగాణ అంశంపై  తాను ఎలాంటి చర్చలు జరపలేదన్నారు. తెలంగాణపై అభిప్రాయ సేకరణ కొనసాగుతోందని చెప్పారు. కేంద్రం ప్రక్రియను కొనసాగిస్తోందని,  అయితే ఈ సమస్యపై పరిష్కారం ఎప్పుడు వస్తుందో ఇప్పుడే చెప్పడం కష్టమన్నారు.  తెలంగాణ రాదని తేలిపోయింది:  లగడపాటి కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటనతో తెలంగాణ రాదని తేలిపోయిందని ఎంపి లగడపాటి రాజగోపాల్ అన్నారు. టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు చెప్పేవన్నీ అబద్ధాలేనన్నారు. రాష్ట్రంలో 80 శాతం మంది సమైక్యాంధ్రను కోరుకుంటున్నారని తెలిపారు. ఏకాభిప్రాయం లేకుండా తెలంగాణ రాష్ట్రం సాధ్యం కాదని అన్నారు. 

ముందంజలో మిట్ రోమ్నీ

వాషింగ్టన్,అక్టోబర్ 9:  అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగమైన తొలి బహిరంగ చర్చలో అధ్యక్షుడు బరాక్ ఒబామాపై ముందంజలో నిలిచిన రిపబ్లికన్ అభ్యర్థి మిట్ రోమ్నీ తాజా సర్వేలోనూ దూసుకుపోయారు. ఒబామాకు 45 శాతం మంది మద్దతు పలకగా, రోమ్నీకి 49 శాతం మంది మద్దతు పలికారు. అక్టోబర్ 3న జరిగిన చర్చ అనంతరం ఈ సర్వేను నిర్వహించారు. అంతకుముందు జరిపిన సర్వేల్లో వెనుకబడి ఉన్న రోమ్నీ చర్చ తర్వాత ముందుకు దూసుకొచ్చారు. 

కొత్తగ్యాస్ కనెక్షన్ల డిపాజిట్ పెంపు

హైదరాబాద్,అక్టోబర్ 9:  కొత్త గ్యాస్  కనెక్షన్లకు డిపాజిట్ పెంచుతూ చమురు కంపెనీలు మంగళవారం నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటివరకు సింగిల్ సిలిండర్ కనెక్షన్‌కు రూ.1,250తో పాటు రెగ్యులేటర్ చార్జీ కింద రూ.150 వసూలు చేస్తుండగా,  తాజాగా సింగిల్ సిలిండర్ డిపాజిట్‌ను రూ. 1,450కు పెంచారు. రెగ్యులేటర్‌తో కలిపితే ఇది రూ.1,600 అవుతుంది. రెండో సిలిండర్ తీసుకోవాలంటే మరో రూ.1,450 చెల్లించాలని గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులు చెబుతున్నారు. మూడేళ్లక్రితం సిలిం డర్ డిపాజిట్ రూ.900 ఉండేది. దాన్ని తర్వాత రూ. 1,250కు పెంచారు. ఇప్పుడిది రూ.1,450 అయ్యింది. 

ఎంబీఏ, ఎంసీఏ ఫీజుల పెంపు... 12 నుంచి కౌన్సిలింగ్‌

హైదరాబాద్,అక్టోబర్ 9:  రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ఫీజులను  భారీగా పెంచారు.. రెండు కోర్సులలో కనీస ఫీజుని 27 వేల రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఎంసీఏ గరిష్ట ఫీజు 88 వేల రూపాయలు, ఎంబీఏ గరిష్ట ఫీజు 71వేల రూపాయలకు పెంచారు. మొత్తం 48 ఎంబీఏ కాలేజీల్లో, 36 ఎంసీఏ కాలేజీలకు  ఫీజుల పెంపు వర్తిస్తుంది. ఈ నెల 12 నుంచి రెండు కోర్సులకు ఆన్‌లైన్‌లో కౌన్సిలింగ్‌ నిర్వహించనున్నారు.

వరల్డ్ టీ-20 జట్టులో కోహ్లీ, రైనా

కొలంబో, అక్టోబర్ 8:    వరల్డ్  టీ-20 జట్టును ఐసీసీ ప్రకటించింది. కెప్టెన్‌గా జయవర్ధనేను ఎంపిక చేశారు. జట్టులో విరాట్ కోహ్లీ, సురేష్ రైనాలకు స్థానం దక్కింది.  ఇలావుండగా,  ట్వంటీ 20 ప్రపంచ కప్‌ను శ్రీలంక జారవిడుచుకున్న నేపథ్యంలో కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని మహేలా జయవర్ధనే నిర్ణయించుకున్నారు. నాలుగు ప్రపంచ కప్ ఫైనల్ ఆడిన మహేలా జయవర్ధనే తన దేశానికి కప్ అందించడంలో మాత్రం విఫలమయ్యారు. తాను సెలెక్టర్లతో మాట్లాడుతానని, శ్రీలంక ట్వంటీ20 జట్టు కెప్టెన్‌గా తప్పుకోవాలని నిర్మయించుకున్నానని ఆయన వెస్టిండీస్‌పై ఓటమి తర్వాత చెప్పారు. జయవర్దనే వికెట్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. జయవర్ధనే  కొద్దిసేపు క్రీజులో నిలబడి ఉంటే ఫలితం భిన్నంగా ఉండేది.

అక్కినేని అమల అరెస్టు

ముంబై, అక్టోబర్ 8:  చారిత్రక కట్టడం చార్మినార్ పై పర్యావరణ పరిరక్షణ బ్యానర్లు కట్టినందుకు అక్కినేని అమలను పోలీసులు అరెస్టు చేశారు.   చార్మినార్ వద్ద అనుమతి లేకుండా ఏ విధమైన బ్యానర్లు కట్టకూడదని, అయితే  అమల గ్రీన్‌పీస్ సభ్యులతో కలిసి ఈ  రూల్ ను అతిక్రమించినందున అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.కాగా, అంతర్జాతీయ జీవ వైవిథ్య సదస్సు సందర్బంగా ప్రజలలో చైతన్యం కలిగించడానికి తాము ఈ ప్రదర్సన నిర్వహించినట్లు అక్కినేని అమల చెప్పారు.  కేంద్రం   13 కోల్ బ్లాక్‌లకు అనుమతి ఇచ్చారని, బొగ్గు తవ్వకాలు గిరిజనులను, జంతువులను నిరాశ్రయులను చేస్తున్నాయని, జంతువుల మనుగడ బొగ్గు తవ్వకాల వల్ల దెబ్బ తింటోందని అమల  మీడియాతో అన్నారు.   

ఆశా భోంస్లే కూతురు ఆత్మహత్య

Image
ముంబై, అక్టోబర్ 8:   ప్రముఖ గాయని ఆశా భోంస్లే కూతురు వర్షా భోంస్లే సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. వర్షా భోంస్లే వయస్సు యాభయ్యేళ్లు. ఆమె ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా పని చేస్తున్నారు. పలు ప్రముఖ దిన పత్రికలకు కాలమిస్టుగా పని చేశారు. ఫ్రీలాన్స్ జర్నలిస్టుగానే కాకుండా తల్లితో కలిసి పలు సంగీత కార్యక్రమాలలో వర్షా పాల్గొన్నారు. హిందీ, మరాఠీ చిత్రాలలో ప్లేబ్యాక్ సింగర్‌గా పని చేశారు. వర్షా భోంస్లే ఆశా భోంస్లే రెండవ కూతురు. ఆరోగ్య సమస్యలతో ఆమె  ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. వర్షా నాలుగేళ్ల క్రితం 2008 లో కూడా ఓసారి ఆత్మహత్యా ప్రయత్నం  చేశారు.

శ్రీలక్ష్మికి బెయిల్

హైదరాబాద్, అక్టోబర్ 8:  ఓఎంసి కేసులో ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మికి బెయిల్ మంజూరైంది. గతంలో ఆమె పలుసార్లు బెయిల్ కోసం ప్రయత్నించారు. చివరికి సోమవారం నాడు  సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. శ్రీలక్ష్మి గత కొంతకాలంగా వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. 

సుప్రీంకోర్టులో జగన్ కు దొరకని బెయిల్...

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: : వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు  తిరస్కరించింది. ఈ సందర్భంగా సిబిఐ తరఫు న్యాయవాది తన వాదన వినిపిస్తూ,  దర్యాఫ్తు కొనసాగుతోందని, ఇలాంటి సమయంలో బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశముందని కోర్టుకు తెలిపారు. ఆయన ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా, ఎంపీగా ఉన్నారని, కాబట్టి సాక్ష్యులను బెదిరింపులకు గురి చేసే అవకాశముందన్నారు. బెయిల్ ఇస్తే కేసు ప్రభావితమవుతుందన్నారు. తాము నాలుగు ఛార్జీషీట్లలో మూడువేల అక్రమాస్తులను గుర్తించామని చెప్పారు. జగన్ విచారణకు సహకరిస్తే ఎప్పుడో పూర్తయ్యేదన్నారు. మారిషస్, లగ్జెంబర్గ్ తదిదర విదేశాల ద్వారా తన కంపెనీలలోకి జగన్ నిధులు మళ్లించారన్నారు. విదేశీ నిధుల ప్రభావంపై విచారించాల్సి ఉందన్నారు. జగన్ కంపెనీల్లోకి వచ్చిన కొన్ని హవాలా మనీ మార్గాలను ఛేదించామన్నారు. సిబిఐ వాదనలతో కోర్టు ఏకీభవించి, బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది.

అమెరికాలో ఆంధ్రవిద్యార్థి దుర్మరణం

టెక్సాస్‌,అక్టోబర్ 5:  అమెరికాలోఆంధ్ర ప్రదేశ్ కు  చెందిన ఓ తెలుగు విద్యార్థి  రోడ్డు ప్రమాదంలోదుర్మరణం చెందాడు. గౌతం అనే ఈ విద్యార్థి టెక్సాక్‌లోని యూనివర్శిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్‌లో ఎంఎస్ చదువుతున్నాడు.  గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. తెనాలికి చెందిన గౌతం కొన్ని రోజుల క్రితమే అమెరికా వచ్చాడు.

వెస్టిండీస్ షాక్...అసీస్ షేక్...

కొలంబో,అక్టోబర్ 5:  ప్రపంచకప్ ట్వంటీ 20లో ఆసీస్‌తో జరిగిన రెండో సెమీ ఫైనల్లో వెస్టిండీస్ 74 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. విండీస్ విసిరిన 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఆసీస్  131 పరుగులకే  చేతులెత్తేసింది. జాన్ బాలీ 63 పరుగులు మినహా . మిగతా ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో ఓటమి పాలైన ఆసీస్ టోర్నీ నుంచి భారంగా నిష్ర్కమించింది. దీంతో విండీస్ తొలిసారి ప్రపంచకప్ ట్వంటీ 20ల్లో ఫైనల్‌కు చేరింది. విండీస్ బౌలర్లలో రామ్‌పాల్‌కు మూడు వికెట్లు లభించగా బద్రీ, పొలార్డ్‌లకు తలో రెండు వికెట్లు , నరైన్, శ్యామ్యూల్స్‌లకు చెరో వికెట్టు లభించింది. విండీస్ ఫైనల్లో శ్రీలంకతో తలపడుతుంది. 

ట్వంటీ 20 ఫైనల్స్ లో శ్రీలంక

కొలంబో,అక్టోబర్ 4:  ప్రపంచకప్ ట్వంటీ 20లో గురువారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 16 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్‌కు చేరుకుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన లంకేయులు 140 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. లక్ష్యాన్ని ఛేదించడంలో   పాకిస్థాన్ విఫలమైంది.  ఓపెనర్లు హఫీజ్ (42), నజీర్ (20) పరుగులతో మంచి ఆరంభాన్నిచ్చినా, మిడిల్ ఆర్డర్ వైఫల్యం తో పాక్ 123 పరుగులకే పరిమితమయింది.  చివర్లో ఉమర్ ఆక్మల్ 29 పరుగులతో రాణించినా అప్పటికే పరిస్థితి చేయిదాటి పోయింది. ఆరుగురు పాకిస్థాన్ ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో ఓటమి తప్పలేదు. లంకేయులు  పకడ్భందీగా బౌలింగ్ చేసి పాక్‌ను నిలువరించారు. శ్రీలంక బౌలర్లలో అత్యధికంగా హెరాత్ మూడు వికెట్లు తీయగా, మాథ్యూస్ , మెండిస్‌లకు తలో రెండు వికెట్లు లభించాయి.

తెలంగాణ మార్చ్ తప్పించుకోడానికే కెసిఆర్‌ ఢిల్లీ డ్రామా-లగడపాటి

న్యూఢిల్లీ,అక్టోబర్ 4:   హైదరాబాద్ లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కాంగ్రెస్  అధిష్టానం పెద్దల వద్ద ప్రతిపాదన పెట్టారని కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించి, రాష్ట్ర విభజన చేయాలని కెసిఆర్ తనంత తానుగా ప్రతిపాదన పెట్టారనిఆయన అన్నారు. తెలంగాణ మార్చ్ సందర్భంగా జరిగిన విధ్వంసంపై కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేకు 16 పేజీల నివేదిక సమర్పించిన తర్వాత లగడపాటి  మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, కెసిఆర్ హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేను కలువలేదని, మిగతా కేంద్ర మంత్రులు మర్యాదపూర్వకంగానే కెసిఆర్‌తో మాట్లాడారని  అన్నారు. చర్చల కోసం కెసిఆర్‌ను ఎవరూ పిలువలేదని, తెలంగాణ మార్ర్చ్ ను తప్పించుకోవడానికే కెసిఆర్ ఢిల్లీ వచ్చారని, గడువు ముగియగానే హైదరాబాదుకు జారుకున్నారని, మళ్లీ చర్చలంటూ బుకాయిస్తున్నారని ఆయన అన్నారు. ఏకాభిప్రాయం లేకుండా తెలంగాణ సాధ్యం కాదని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ సహా కేంద్ర మంత్రులు గులాం నబీ ఆజాద్, వాయలార్ రవి, సుశ...

జగన్ అక్రమాస్తుల కేసులో ఈడి :చర్యలు : రు. 51 కోట్ల జప్తు

హైదరాబాద్,అక్టోబర్ 4:  వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ అక్రమాస్తుల కేసులో  మనీలాండరింగ్ చట్టాల ఉల్లంఘనను ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడి) నిర్ధారించింది. ఈ మేరకు ఈడి 51 కోట్ల రూపాయల విలువ చేసే స్థిర, చరాస్తులను జప్తు చేసింది.  తాము ఆస్తులు జప్తు చేసిన సంస్థలు కుట్రల ద్వారా ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందాయని ఈడి వ్యాఖ్యానించింది. హెటిర్ డ్రగ్స్ కు చెందిన 35 ఎకరాల భూమిని, 3 కోట్ల రూపాయల ఫిక్స్ డ్ డిపాజిట్లను ఈడి జప్తు చేసింది. అలాగే జననీ ఇన్‌ఫ్రాకు చెందిన 13 ఎకరాల భూములను కూడా జప్తు చేసింది. వైయస్ జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్ సంస్థకు చెందిన 14.5 కోట్ల రూపాయల ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఈడి జప్తు చేసింది. అరబిందో ఫార్మాకు చెందిన 96 ఎకరాల భూమిని, 3 కోట్ల రూపాయల ఫిక్సెడ్  డిపాజిట్లను ఈడి జప్తు చేసింది. వైయస్ జగన్ అక్రమంగా ఆస్తులను సంపాదించుకోవడానికి ఈ సంస్థలు సహకరించాయని ఈడి ఆరోపించింది. జగన్‌తో పాటు మరో 73 మంది నిందితులపై కూడా ఈడి దర్యాప్తు సాగిస్తోంది.

నవంబర్లో హిమాచల్, డిసెంబర్లో గుజరాత్ ఎన్నికలు

న్యూఢిల్లీ,అక్టోబర్ 3:  గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ  ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. 182 స్థానాలు కలిగిన గుజరాత్ అసెంబ్లీకి  డిసెంబర్ 13,  డిసెంబర్ 17 తేదీలలో రెండు దఫాల్లో ఎన్నికలు జరుగుతాయి. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 68 స్థానాలకు నవంబర్ 4న ఒకే విడతలో ఎన్నికలు జరుగుతాయి. రెండు రాష్ట్రాలలో  ఓట్ల లెక్కింపు డిసెంబరు 20 చేపట్టనున్నట్టు ఈసీ తెలిపింది.  గుజరాత్ అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది జనవరి 17తోనూ, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ గడువు జనవరి 10 తోనూ ముగియనున్నాయి. 

చర్చలు జరిపా...తెలంగాణా వచ్చెస్తుంది: కె.సి.ఆర్.

న్యూఢిల్లీ,అక్టోబర్ 3: కాంగ్రెసు పార్టీ అధిష్టానంతో జరిపిన చర్చలు ఫలఫ్రదంగా ముగిశాయని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు.  బుధవారం హైదరాబాదు బయలుదేరే ముందు ఢిల్లీలో విలేకరులతో  మాట్లాడుతూ.. పలువురు నేతలతో తాను తెలంగాణ అంశంపై  చర్చించానని,  త్వరలో సానుకూల నిర్ణయం వెలువడుతుందని చెప్పారు.  మీడియాకు తెలిసి కొందరితోనే భేటీ అయ్యానని కానీ, తెలియకుండా చాలామందితో చర్చించానని చెప్పారు. కాంగ్రెసు పార్టీ ఆహ్వానం మేరకే తాను ఢిల్లీకి వచ్చానన్నారు. గత నెల నాలుగో తారీఖున పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లిన కె.సి.ఆర్. పార్లమెంటు సమావేశాలు  రెండు రోజులే జరిగినప్పటికీ అప్పటి నుండి  నెల రోజుల పాటు అక్కడే ఉండిపోయారు.

గెలిచినా తప్పని నిష్క్రమణ...

రన్‌రేట్ లేక సెమీస్‌కు చేరని టీమిండియా.. కొలంబో,అక్టోబర్ 2:  ప్రపంచకప్ ట్వంటీ 20నుంచి భారత్ నిష్ర్కమించింది. సూపర్‌ఎయిట్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లోవిజయం సాధించినప్పటికీ రన్‌రేట్ ప్రకారం సెమీస్‌కు చేరలేక ఇంటిముఖం పట్టాల్సివచ్చింది.  టాస్ ఓడి ముందు బ్యాటింగ్ చేసిన భారత్ -దక్షిణాఫ్రికాకు 153 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రన్‌రేట్ ప్రకారం భారత్ సెమీస్‌కు చేరాలంటే 121 పరుగులకు సఫారీలను నియంత్రించాలి. అయితే సఫారీలను నియంత్రించడంలో టీమిండియా ఆటగాళ్లు విఫలమయ్యారు.  దక్షిణాఫ్రికా  19.5 ఓవర్లలో 151 పరుగులు చేసింది.  ప్లెస్సీ అత్యధికం గా 65 పరుగులు చెసి బారత్ సెమీస్ ఆశలపై నీళ్ళు చల్లాడు. దీనితో  గ్రూప్-1 నుంచి శ్రీలంక , వెస్టిండీస్‌లు సెమీస్‌కు అర్హత సాధించగా, గ్రూప్-2 నుంచి ఆసీస్, పాకిస్తాన్‌ సెమీస్‌కు చేరాయి.
Image
          దుర్గా పూజ కోసం అలహాబాద్ లో అమ్మవారి విగ్రహాన్ని తీర్చి దిద్దుతున్న ఓ కళాకారుడు...

ఆస్ట్రేలియాపై పాక్ విజయం,,,భారత్ కు సంకటం

కొలంబో,అక్టోబర్ 2:  ఐసీసీ ప్రపంచకప్ ట్వంటీ 20  టోర్నమెంట్  సూపర్ 8 రౌండ్ లో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై పాకిస్థాన్ విజయం సాధించి సెమీఫైనల్ ఆశల్ని సజీవంగా ఉంచుకొంది. పాకిస్థాన్ నిర్ధేశించిన 150 పరుగుల విజయలక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 117 పరుగులకు చేసింది. దాంతో పాకిస్థాన్ 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ హస్సీ  54 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ తొలుత చేసిన  పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. పాకిస్థాన్ జట్టులో అత్యధికంగా నాసిర్ జెమ్ షెడ్ 55, కమ్రాన్ అక్మల్ 32, అబ్దుల్ రజాక్ 22 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా జట్టులో స్టార్క్ 3, దోహర్తి, వాట్సన్, కమిన్స్ చెరో వికెట్ తీశారు. ఇప్పటికే ఆస్ట్రేలియా సెమీ ఫైనల్‌కు చేరిన ఆస్ట్రేలియా కు ఈ ఓటమి వల్ల  ప్రమాదమేమీ లేదు. కానీ,  ఇందువల్ల భారత్‌ దక్షిణాఫ్రికాపై తప్పనిసరిగా మంచి రన్ రేటుతో గెలవాల్సి ఉంటుంది.

నవంబర్ 26న కేజ్రీవాల్ పార్టీ...విజన్ డాక్యుమెంట్ సిద్ధం ...

Image
విజన్ డాక్యుమెంట్ విడుదల చేస్తున్న కేజ్రీవాల్  న్యూఢిల్లీ,అక్టోబర్ 2:  అవినీతిపై  పోరాటం చేసిన సామాజిక కార్యకర్త అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ రంగ ప్రవేశానికి రంగం సిద్ధమైంది. జన్ లోక్ పాల్ ఉద్యమంలో మరో పోరాటమే రాజకీయ పార్టీ స్థాపన అని,  నవంబర్ 26న పార్టీ పేరు ప్రకటిస్తామని  అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. రాజకీయ విప్లవంతోనే జన్ లోక్ పాల్ సాధ్యమవుతుందని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. 13 అంశాలతో పార్టీ ఎందుకు పెడుతున్నామో ప్రచారం చేస్తామని, స్వరాజ్ పార్టీ,  లేక లోక్ పాల్ పార్టీ పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. పార్టీ విజన్ డాక్యుమెంట్ ను మంగళవారం ఆయన  విడుదల చేశారు. అవినీతిని అంతం చేయటంతో పాటు నిత్యవసర వస్తువుల ధరలు తగ్గిస్తామని కేజ్రీవాల్ తెలిపారు. ప్రజాభిప్రాయం మేరకే భూసేకరణ చేపడతామని, అందరికీ మంచి విద్యతో పాటు వైద్యాన్ని అందిస్తామన్నారు. ఎన్నికల్లో అభ్యర్థులను తిరస్కరించే అధికారంతో పాటు ఎన్నికైన అభ్యర్థులను వెనక్కి పిలవటం.... రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధరలు అందిస్తామన్నారు.తమ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలెవరూ ఎలాంటి భద్రతను పెట్టుకోమని,  సర్కార్ బ...

ప్రపంచకప్ ట్వంటీ 20లో ఇంగ్లండ్ ఇంటికి...

పల్లెకలె,అక్టోబర్ 1:  ప్రపంచకప్ ట్వంటీ 20లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ కథ ముగిసింది. సూపర్‌ఎయిట్‌లో  శ్రీలంకతో తలపడిన ఇంగ్లండ్ 19 పరుగుల తేడాతో ఓటమి చెంది టోర్నీ నుంచి నిష్ర్కమించింది. 170 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లండ్ 150 పరుగులకే పరిమితమైంది. ఇంగ్లండ్ ఆటగాళ్లలో ఒక్క పటేల్(67) పరుగుల మినహా ఎవరూ రాణించకపోవడంతో ఓటమి తప్పలేదు. చివర్లో స్వాన్ (34) పరుగలతో రాణించినా ప్రయోజనం లేక పోయింది. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన  శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది.  గ్రూప్-1 నుంచి శ్రీలంక, వెస్టిండీస్‌లు సెమీస్‌కు అర్హత సాధించగా, కివీస్, ఇంగ్లండ్‌లు ఇంటిదారి పట్టాయి. వరుస మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన శ్రీలంక అగ్రస్థానంలో కొనసాగుతోంది.

కింగ్‌ఫిషర్ కు తాత్కాలికంగా తాళం

ఢిల్లీ,అక్టోబర్ 1:  కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఆ సంస్థ సోమవారం రాత్రి తెలిపింది.గత కొంత కాలంగా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న కింగ్‌ఫిషర్ సేవలను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు  సంస్ధ యజమాని విజయమాల్యా తెలిపారు. కింగ్‌ఫిషర్ ఉద్యోగులు సమ్మె బాట పట్టడంతో  సమస్యను ఒక కొలిక్కి తీసుకు వచ్చే క్రమంలో యాజమన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఎఫ్.డి.ఐ. లపై యుద్ధం చేస్తాం: మమత

Image
న్యూఢిల్లీ, ,అక్టోబర్ 1:  మల్టీబ్రాండ్ రిటైల్ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అనుమతిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలను చేపట్టడానికి  సిద్ధపడుతున్నట్లు తృణమూల్ కాంగ్రెసు అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. యుపిఎ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ తృణమూల్ కాంగ్రెసు సోమవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ర్యాలీలో మాట్లాడుతూ,  పార్లమెంటు సమావేశాల్లో తాము యుపిఎ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించే అవకాశం ఉందని ఆమె తెలిపారు. ఎఫ్‌డిఐల విషయంలో యుపిఎ ప్రభుత్వం లక్ష్మణరేఖను దాటిందని వ్యాఖ్యానించారు. ఎఫ్‌డిఐల అనుమతి వల్ల ఉద్యోగాలు పోతాయని, లఘు పరిశ్రమలపై తీవ్రమైన ప్రభావం పడుతుందని ఆమె అన్నారు. జెడి (యు) అధ్యక్షుడు శరద్ యాదవ్ కూడా ర్యాలీలో పాల్గొన్నారు. మద్దతిస్తాం: కరుణానిధి మరోవైపు ,రిటైల్ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు తీర్మానం తీసుకువస్తే... తాము మద్దతిస్తామని డీఏంకే అధినేత కరుణానిధి స్పష్టం చేశారు. అయితే తమ పార్టీ తీసుకునే నిర్ణయం కాంగ్రెస్ తో ఉన్న సంబంధాలపై అంతగా ప్రభావం చూపదని కరుణానిధి అన్నారు....

మెగా జీవ వైవిధ్య కేంద్రంగా భారత్ : జయంతీ నటరాజన్

Image
 హైదరాబాద్ లో జీవ వైవిద్య సదస్సు ప్రారంభం...  హైదరాబాద్,అక్టోబర్ 1:   హైదరాబాద్ లో 19 రోజులపాటు జరిగే 11వ జీవ వైవిద్య సదస్సును కేంద్ర పర్యావరణ శాఖమంత్రి జయంతీ నటరాజన్ సోమవారం ప్రారంభించారు. భారతదేశం మెగా జీవ వైవిధ్య కేంద్రంగా అవతరిస్తోందని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా అన్నారు.  ఆధునికీకరణ, వాతావరణ మార్పుల వల్ల జీవ వైవిధ్యానికి ముప్పు పొంచి ఉందనే విషయాన్ని అందరూ గుర్తించాలన్నారు. జీవ వైవిధ్యంపై హైదరాబాద్ లో జరుగుతున్న ఈ సదస్సుకు చాలా ప్రాధాన్యత ఉందన్నారు. మానవ ఆరోగ్య మెరుగుదల కోసం జీవ సమతౌల్యం అవసరమని తెలిపారు. జీవ వైవిధ్యాన్ని కాపాడే విషయంలో ఎదురవుతున్న అడ్డంకులను ఎలా ఎదుర్కొవాలనే అంశాన్ని సదస్సులో చర్చిస్తారని, భవిష్యత్ ప్రణాళికలపై నిర్ణయాలు తీసుకుంటారని జయంతీ నటరాజన్ పేర్కొన్నారు. జీవ వైవిధ్యంపై ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాయని, ఆ దిశగా పరిశోధనలు చేస్తున్నాయని, అవి మరింత విస్తృతం కావాలని ఆమె ఆకాంక్షించారు. సవాళ్లను ఎదుర్కొని జీవ వైవిధ్యాన్ని భావి తరాలకు అందించాల్సిన ప్రాముఖ్యతను జయంతీ నటరాజన్ నొక్కిచెప్పారు.ఈ సదస్సులో 190 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటున్న...